'సెట్‌లో అందరూ చూస్తుండగా దారుణంగా'.. సౌత్‌పై తాప్సీ బోల్డ్ కామెంట్స్ | Taapsee Pannu comments about south Industry Films | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: 'అందరి ముందు అలా చెప్తే ఎంత అవమానం'

Feb 22 2026 11:38 AM | Updated on Feb 22 2026 12:05 PM

Taapsee Pannu comments about south Industry Films

హీరోయిన్ తాప్సీ పన్ను గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అ‍క్కర్లేదు. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా అస్సీ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది.  ఈ సందర్భంగా తాప్సీ పన్ను ప్రమోషన్స్‌కు హాజరైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సౌత్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది ముద్దుగుమ్మ. సౌత్‌లో షూటింగ్ సమయంలో ప్యాడెడ్ బ్రా వేసుకోమని చెప్పేవారని షాకింగ్ కామెంట్స్ చేసింది. షూట్‌లో అందరి ముందూ అలాంటి మాటలు చెప్తే ఎలా అసౌకర్యంగా ఉంటాయో ఒక మహిళగా నాకు తెలుసన్నారు. ఏదైనా సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు అందరూ గమనిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందోనని ఓపెన్‌గా మాట్లాడింది. తాజాగా తాప్సీ చేసిన కామెంట్స్ సౌత్‌ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

నాభిపైనే మోజుఎందుకు..?

అంతేకాకుండా సౌత్ సినిమాల్లో పాటల్లో నాభిపై అంతగా మోజు ఎందుకని తాప్సీ ప్రశ్నించింది. అసలు అక్కడే ఎందుకు ఫోకస్ పెడతారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. హిందీ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో నాభిపై ఫోకస్ ఉండదని నేను చెప్పడం లేదు.. కానీ సౌత్ సినిమాల్లో ఉన్నంతగా మాత్రం ఉండదని తాప్సీ తన మనసులో మాటను బయటపెట్టేసింది.

కాగా.. గతంలో కూడా డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పండ్లు, కొబ్బరికాయలు వేసే సంప్రదాయంపై తాప్సీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది ముద్దుగుమ్మ.

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన అస్సీ ఫిబ్రవరి 20న విడుదలైంది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్సివ్ కోర్ట్‌రూమ్ డ్రామాను థియేటర్స్‌లో చూడాలని ఆమె కోరింది. మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కఠినమైన సామాజిక కథాంశంతో అస్పీని తెరకెక్కించారు. ఇందులో తాప్సీ ధైర్యంతో కూడిన న్యాయవాదిగా నటించగా..  మలయాళ నటి కని కుస్రుతి అత్యాచార బాధితురాలిగా కనిపించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement