ప్రభాస్ ఆల్‌టైమ్ ఫేవరేట్‌ మూవీ ఏంటో తెలుసా? | Hero Prabhas Reveals His All Time Favourite Movie | Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్ ఆల్‌టైమ్ ఫేవరేట్‌ మూవీ ఇదే..!

Feb 22 2026 7:31 AM | Updated on Feb 22 2026 7:32 AM

Hero Prabhas Reveals His All Time Favourite Movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇటీవల కపుర్ ఫ్రెండ్లీ టీమ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్.

కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన ఆల్‌ టైమ్ ఫేవరేట్ మూవీ గురించి మాట్లాడారు. నాగార్జున, గిరిజా షెట్టర్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి అని తెలిపారు. ఈ ప్రేమకథా చిత్రం ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ చూడాలనిపించే చిత్రమన్నారు.

తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' ఒకటి. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం కల్ట్‌ క్లాసిక్‌ మూవీగా నిలిచింది. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్కతెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా హీరో, హీరోయిన్లుగా ఇద్దరికీ ఫేమ్ ‍తీసుకొచ్చింది.

g

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement