'ఇండియాకు రప్పించే వరకు నిద్రపోను'..అన్వేశ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ | Karate Kalyani Strong Warning To Youtuber Anvesh | Sakshi
Sakshi News home page

Karate Kalyani: 'ఇండియాకు రప్పించే వరకు నిద్రపోను'.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్

Feb 22 2026 6:47 AM | Updated on Feb 22 2026 11:03 AM

Karate Kalyani Strong Warning To Youtuber Anvesh

ప్రముఖ యూట్యూబర్‌, ప్రపంచ యాత్రికుడు అన్వేశ్‌కు నటి కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నిన్ను ఇండియాకు రప్పించేవరకు తాను నిద్ర పోయేదని లేదన్నారు. మరో రెండు రోజుల్లో నీపై లుక్ అవుట్ నోటీసులు ఇప్పిస్తానని కరాటే కల్యాణి హెచ్చరించారు. ఇప్పటికే హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడారంటూ   సినీనటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ ఛానెల్ 'అన్వేషణ' అకౌంట్ బ్లాక్ వ్యవహారంపై కరాటే కల్యాణి స్పందించారు.

ఇటీవల యూట్యూబర్ నా అన్వేశ్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది.  ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ మెటా అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను డిలీట్‌ చేసింది. మన దేశాన్ని దూషించడంతో పాటు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్లో తన సోషల్‌ మీడియా అకౌంట్లలో అన్వేష్‌ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికే పలువురి ఫిర్యాదులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అన్వేష్‌ సోషల్‌ మీడియా అకౌంట్లను పరిశీలించారు. వాటిల్లో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కంటెంట్‌ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశంపై ఇన్‌స్టా మాతృ సంస్థ మెటాను సంప్రదించారు. అన్వేష్‌ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మెటా సైతం అన్వేష్‌ ఇన్‌స్టా అకౌంట్‌లను పరిశీలించింది. అనంతరం, అతడి అకౌంట్లపై నిషేదం విధించింది. గతంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది.

Advertisement
 
Advertisement
Advertisement