వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్ధమైన “మన శంకర వరప్రసాద్ గారు” | Chiranjeevi Mana Shankara Varaprasad ready for world television premiere | Sakshi
Sakshi News home page

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్ధమైన “మన శంకర వరప్రసాద్ గారు”

Feb 21 2026 11:29 PM | Updated on Feb 21 2026 11:35 PM

Chiranjeevi Mana Shankara Varaprasad ready for world television premiere

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.  

థియేటర్స్‌ రన్ విజయవంతమైన తర్వాత ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్ధమైంది. జీ తెలుగు వారు ఈ ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 కి ప్రసారం కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. జీ సంస్థ ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులతో పాటు శాటిలైట్ హక్కులు కూడా సొంతం చేసుకుంది. 

మరి ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం  అందించగా సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణం వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement