18 ఏళ్లప్పుడు రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా | Ravi Basrur About His Name And Life Experience | Sakshi
Sakshi News home page

Ravi Basrur: ఆయనిచ్చిన రూ.35 వేలు నా జీవితాన్ని మార్చేశాయ్

Feb 21 2026 9:08 PM | Updated on Feb 21 2026 9:08 PM

Ravi Basrur About His Name And Life Experience

'కేజీఎఫ్' పేరు చెప్పగానే ప్రశాంత్ నీల్, యష్‌తో పాటు రవి బస్రూర్ అనే పేరు కూడా కచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఈయన ఇచ్చిన మ్యూజిక్ అలాంటిది. తర్వాత 'సలార్' పలు చిత్రాలకు సంగీతమందించి బాగానే పేరు తెచ్చుకున్నాడు. దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. ఈయన చేసిన లేటెస్ట్ తెలుగు మూవీ 'కల్ట్'. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. తాజాగా టీజర్ లాంచ్ జరగ్గా.. ఈ వేడుకలో పాల్గొన్న రవి బస్రూర్ తన గతం గురించి మరోసారి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

(ఇదీ చదవండి: గోల్డ్‌ రోలెక్స్‌ వాచ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన విశ్వక్‌.. రవి బస్రూర్‌ ఎమోషనల్‌)

'విశ్వక్ సేన్ ప్రవర్తనకు ఫిదా అయిపోయా. 25 ఏళ్లుగా సంగీతమందిస్తున్నాను. అందరూ నన్నే గుర్తిసే విశ్వక్.. నా జర్నీని గుర్తించారు. ఇతడి కోసం నేనెప్పుడూ ఉంటాను. నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. రెండోసారి ఓ వ్యక్తి నన్ను కాపాడాడు. నాకు కీ బోర్డ్ కొనివ్వడంతో పాటు రూ.35 వేలు ఇచ్చాడు. ఆయన పేరు రవి. అందుకే నా పేరు ముందు ఆయన పేరుని జోడించాను' అని రవి బస్రూర్ చెప్పుకొచ్చాడు.

గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి మాట్లాడిన రవి బస్రూర్.. తన అసలు పేరు కిరణ్ అని, కానీ రవి బస్రూర్ అని పిలిస్తే చాలా సంతోషిస్తానని అన్నాడు. ఎనిమిదో తరగతిలో ఫెయిల్ అయిన తనని ప్రశాంత్ నీల్ నమ్మి అవకాశమిచ్చాడని, తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని కూడా చెప్పుకొచ్చాడు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు అయినప్పటికీ.. బంగార ఆభరణాలు తయారు చేసే వృత్తి కూడా నేర్చుకున్నాడు. లాక్‌డౌన్ టైంలో ఈ పనిచేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

(ఇదీ చదవండి: ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు)

Advertisement
 
Advertisement
Advertisement