‘కిల్లర్’లో థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ గ్రాండ్‌గా ఉన్నాయి: అనిల్‌ రావిపూడి | Killer Movie Teaser Released By Anil Ravipudi | Sakshi
Sakshi News home page

‘కిల్లర్’లో థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ గ్రాండ్‌గా ఉన్నాయి: అనిల్‌ రావిపూడి

Feb 21 2026 6:19 PM | Updated on Feb 21 2026 7:03 PM

Killer Movie Teaser Released By Anil Ravipudi

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ చిత్ర టీజర్ గ్రాండ్‌గా విడుదలైంది. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

టీజర్ విడుదల చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "పూర్వాజ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ సినిమాలోని కొన్ని సీక్వెన్స్ చూశాను, చాలా బాగున్నాయి. సైన్స్ ఫిక్షన్ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను కలిపి చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా జ్యోతి గారి ట్రాన్స్‌ఫర్మేషన్ తోపాటు యాక్షన్ సీన్స్ షాకింగ్‌గా ఉన్నాయి. రియల్ లైఫ్ భార్యాభర్తలు రీల్ లైఫ్‌లో ఎలా మెప్పించారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది," అని చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.

దర్శక-నిర్మాత పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే గొప్ప మనసుతో టీజర్‌ను లాంచ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన పాజిటివిటీ తమ టీమ్‌లో మరింత ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement