మగవాడికి తాళి కట్టి కాపురం? కోన వెంకట్‌ రియాక్షన్‌ ఇదే! | Kona Venkat Clarifies Band Melam is not a Gay Film | Sakshi
Sakshi News home page

Kona Venkat: బ్యాండ్‌ మేళం గే లవ్‌ స్టోరీ? కోన వెంకట్‌ ఏమన్నాడంటే?

Feb 21 2026 5:47 PM | Updated on Feb 21 2026 6:46 PM

Kona Venkat Clarifies Band Melam is not a Gay Film

కోర్ట్‌ జంట శ్రీదేవి -రోషన్‌ మరోసారి జతగా కలిసి నటించిన చిత్రం బ్యాండ్‌ మేళం. ఈసారి వీళ్లిద్దరూ బావమరదళ్లుగా నటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఈ మూవీ నుంచి ఊహించని గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. అందులో ప్రేమ కబుర్లు ఉంటాయనుకుంటే హీరో బ్రేకప్‌ బాధలో మునిగి తేలుతుంటాడు.

ఫ్రెండ్‌ మెడలో తాళి కట్టిన హీరో
'తాళి కట్టుడు కలిసుండటం కోసమే అయితే.. మధ్యలో విడిచిపెట్టి పోయిన దానికి కాదురా, చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్న వీడికి కట్టాలిరా' అంటూ స్నేహితుడి మెడలో మూడు ముళ్లు వేస్తాడు హీరో. ఈ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సీన్‌ చూసిన ఓ వ్యక్తి హీరోను లెస్బియన్‌ అనుకున్నాడట! ఈ విషయాన్ని బ్యాండ్‌ మేళం నిర్మాత కోన వెంకట్‌ తాజాగా వెల్లడించాడు.

గే లవ్‌ స్టోరీయా?
శనివారం నాడు బ్యాండ్‌ మేళం నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసిన సందర్భంగా కోన వెంకట్‌ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. వాలంటైన్స్‌ గ్లింప్స్‌ చూశాక నాకో ఫన్నీ మెసేజ్‌ వచ్చింది. గే లవ్‌స్టోరీని తెరపై తీసుకొస్తున్నందుకు థాంక్యూ సర్‌ అని ఓ అబ్బాయి మెసేజ్‌ పెట్టాడు. అది చూసి షాకైపోయాను. 

ఎమోషనల్‌గా ఫీలయ్యా..
ఓహో.. మగవాడు మగవాడికి తాళి కట్టాడు కాబట్టి, వాళ్లిద్దరూ కాపురం చేసుకుంటారు, బెడ్‌రూమ్‌లో పాల గ్లాసు పట్టుకెళ్తాడు అనుకున్నట్లున్నాడు! చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాడు. బాబూ, ఇది గే లవ్‌స్టోరీ కాదు. మనసును తాకే లవ్‌ స్టోరీ. ఫన్‌తో పాటు ఎమోషన్స్‌ కూడా ఈ మూవీలో ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. సతీశ్‌ జవ్వాజి దర్శకత్వం వహించిన బ్యాండ్‌ మేళం మార్చి 13న విడుదల కానుంది.

చదవండి: మీ వల్లే ఇలా బతుకుతున్నా.. ఏడ్చేసిన వరలక్ష్మి

Advertisement
 
Advertisement
Advertisement