నభా నటేష్ ‘డబుల్’ ఇంపాక్ట్ | Nabha Natesh Swayambhu and Nagabandham Films To Release In This Summer | Sakshi
Sakshi News home page

ఒకే సీజన్, రెండు భారీ చిత్రాలు.. దూసుకెళ్తున్న నభా నటేష్‌!

Feb 21 2026 4:24 PM | Updated on Feb 21 2026 4:29 PM

Nabha Natesh Swayambhu and Nagabandham Films To Release In This Summer

టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేష్‌కు ఈ వేసవి కాలం కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారబోతోంది. సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు 'స్వయంభు', 'నాగబంధం' అనే రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాలు కూడా పూర్తి భిన్నమైన కథా నేపథ్యాలతో రూపొందడం విశేషం. స్వయంభులో 'సుందరవల్లి' అనే ఒక హుందాతనమైన యువరాణి పాత్రలో నభా కనిపించబోతోంది. నాగబంధంలో 'పార్వతి' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను పోషిస్తోంది.

ఒకే సీజన్‌లో ఒక యంగ్ హీరోయిన్ నటించిన రెండు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాలు విడుదల కావడం టాలీవుడ్‌లో ఒక అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రాల టీజర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

నభా నటేష్ ఈ చిత్రాల విజయంపై పూర్తి ధీమాతో ఉంది. కంటెంట్ కనుక ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే, ఈ సమ్మర్ తర్వాత ఆమె స్టార్ ఇమేజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. మొత్తానికి, ఈ సమ్మర్ నభా నటేష్ పర్ఫార్మెన్స్‌తో థియేటర్లు కళకళలాడబోతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement