breaking news
Naga Bandham Movie
-
నాగబంధం.. నభా నట విశ్వరూపం!
సినిమాల్లో హీరోయిన్లను ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితం చేస్తుంటారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నటిగా తన ప్రతిభను చాటుకుంది నభా నటేష్. ఆమె హీరోయిన్గా, విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాగబంధం. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా..సినిమా చూసిన ప్రతి ఒక్కరు నభా నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో పార్వతి అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ నభా నటేష్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఒకే పాత్రలో అనేక వైవిధ్యమైన భావోద్వేగాలను పలికించడం ద్వారా నటిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది నభా. దయ, పట్టుదల, దిక్కారం, బలహీనత, భక్తి..ఇలా అనేక ఎమోషన్స్ ను తన నటనలో పలికించింది అందరి ప్రశంసలు అందుకుంటోందీ నాయిక.తారలకు ఇలాంటి అవకాశం రావడం అరుదు. ఆ అవకాశాన్ని తన టాలెంట్, డెడికేషన్ తో సద్వినియోగం చేసుకుంది నభా. నాలుగు భిన్నమైన కోణాల్లో ఒకే పాత్రను పోషించి సర్ ప్రైజ్ చేసింది నభా నటేష్. అందమే కాదు ప్రతి ఎక్స్ ప్రెషన్ లో స్టోరీని ఆవిష్కరించింది నభా. నటిగా తనకున్న నిబద్దతను ప్రూవ్ చేసుకుంటూ...ప్రేక్షకుల్ని మైమరపించే నటనను కనబర్చింది.ఈ సినిమా నభా నటేష్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీగా మిగిలిపోనుంది. -
ఇలాంటి చాన్స్ అరుదుగా వస్తుంది: నభా నటేష్
‘‘నాగబంధం, స్వయంభు’ వంటి పాన్ ఇండియా చిత్రాల్లో ఒకే సమయంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి. ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడదగ్గవే. ఇలాంటి బిగ్ మూవీస్‌లో నటించడం నాకు చాలా సంతృప్తిగా ఉంది’’ అని నభా నటేష్ చెప్పారు. విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నాగబంధం–ది సీక్రెట్ ట్రెజర్’. కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్ మాట్లాడుతూ– ‘‘నాగబంధం’లో నేను పార్వతి అనే వేద విద్యార్థిని పాత్రలో కనిపిస్తాను.కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం ఆమెది. పార్వతి తీసుకునే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. నా పాత్ర కోసం రెడీ అవడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. ఇలాంటి సినిమాల్లో నటించే చాన్స్ చాలా అరుదుగా వస్తుంది. ఈ సినిమా కోసం వేసిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మేం చాలా నియమ నిష్టలతో పని చేశాం. పూర్తిగా శాకాహారులుగా ఉన్నాం. ‘నమోరే..’ పాటను దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో గణేష్ ఆచార్య మాస్టర్ తెరకెక్కించారు. ఈ పాట స్క్రీన్‌పై చాలా బాగుంటుంది. అభిషేక్ నామాగారు ‘నాగబంధం’ని అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
నాగబంధం: రూ.35 కోట్లు అనుకుంటే 110 కోట్లకు పెరిగింది
విరాట్ కర్ణ హీరోగా నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిశిత, కిషోర్ మాట్లాడుతూ– ‘‘మేం ఓ సాఫ్ట్వేర్ కంపెనీని విజయవంతంగా నిర్వహించి, మరో వ్యాపారం చేయాలనుకుని సినీ పరిశ్రమకు వచ్చాం. ‘నాగబంధం’ కంటే ముందు ఓ పెద్ద హీరోతో సినిమా చేయాల్సింది. కానీ నిర్మాతలుగా నిరూపించుకోలేదు కాబట్టి ఆ చాన్స్ మా చేజారింది. ఆ తర్వాత అభిషేక్ నామాగారి దగ్గర ఉన్న స్క్రిప్ట్ గురించి నిర్మాత రవీందర్ రెడ్డి చెప్పారు. అభిషేక్గారిని కలిశాం. ఆయన విజన్ నచ్చింది. ఈ సినిమాను దాదాపు రూ. 35 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేయాలనుకున్నాం. కానీ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో రిస్క్ చేసి, రూ. 110 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించాం. ఈ సినిమాకి విరాట్ కర్ణ పర్ఫెక్ట్ హీరో అనిపించారు. ఫిజికల్‌గా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేని మేం ఇంత భారీ సినిమా చేయడం దైవానుగ్రహంగా భావిస్తున్నాం. కార్తీక పౌర్ణమి రోజున ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరిగింది. అదే రోజు 24 గంటల పాటు షూట్లో భాగంగా శివునిపై అభిషేకం జరగడం ఆశీర్వాదం అనే భావన కలిగింది. ఈ సినిమా మేం ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే సీక్వెల్ చేస్తాం’’ అని చెప్పారు. -
నభా నటేష్ ‘డబుల్’ ఇంపాక్ట్
టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేష్‌కు ఈ వేసవి కాలం కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారబోతోంది. సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు 'స్వయంభు', 'నాగబంధం' అనే రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాలు కూడా పూర్తి భిన్నమైన కథా నేపథ్యాలతో రూపొందడం విశేషం. స్వయంభులో 'సుందరవల్లి' అనే ఒక హుందాతనమైన యువరాణి పాత్రలో నభా కనిపించబోతోంది. నాగబంధంలో 'పార్వతి' అనే పవర్ఫుల్ క్యారెక్టర్‌ను పోషిస్తోంది.ఒకే సీజన్లో ఒక యంగ్ హీరోయిన్ నటించిన రెండు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాలు విడుదల కావడం టాలీవుడ్లో ఒక అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రాల టీజర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది.నభా నటేష్ ఈ చిత్రాల విజయంపై పూర్తి ధీమాతో ఉంది. కంటెంట్ కనుక ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే, ఈ సమ్మర్ తర్వాత ఆమె స్టార్ ఇమేజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. మొత్తానికి, ఈ సమ్మర్ నభా నటేష్ పర్ఫార్మెన్స్తో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. -
Naga Bandham: ఒకే ఒక పాట కోసం రూ. 10 కోట్లు.. హైదరాబాద్‌లో భారీ సెట్!
‘పెదకాపు’ చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అన్నది ట్యాగ్‌లైన్. నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేశ్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్‡్ష నామా సమర్పణలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్‌పై కిశోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్లో పాట చిత్రీకరణ జరుగుతోంది. ‘‘ఈ పాటలో విరాట్ కర్ణతో పాటు 5000 మంది నృత్య కళాకారులు పాల్గొంటున్నారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య పర్యవేక్షణలో ఈ ΄ాటను చిత్రీకరిస్తున్నాం. ఈ ఒక్క ఎపిసోడ్‌కే రూ. 10 కోట్లు బడ్జెట్ కేటాయించాం. ఈ అద్భుతమైన సీక్వెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అభే.


