నాగబంధం.. నభా నట విశ్వరూపం! | Nabha Natesh Play Powerful Role In Nagabandham | Sakshi
Sakshi News home page

నాగబంధం.. నభా నట విశ్వరూపం!

Jul 14 2026 12:50 PM | Updated on Jul 14 2026 1:00 PM

Nabha Natesh Play Powerful Role In Nagabandham

సినిమాల్లో హీరోయిన్లను ఎక్కువగా గ్లామర్‌ పాత్రలకు పరిమితం చేస్తుంటారు. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నటిగా తన ప్రతిభను చాటుకుంది నభా నటేష్‌. ఆమె హీరోయిన్‌గా, విరాట్‌ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాగబంధం. 

ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా..సినిమా చూసిన ప్రతి ఒక్కరు నభా నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో పార్వతి అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ నభా నటేష్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఒకే పాత్రలో అనేక వైవిధ్యమైన భావోద్వేగాలను పలికించడం ద్వారా నటిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది నభా. దయ, పట్టుదల, దిక్కారం, బలహీనత, భక్తి..ఇలా అనేక ఎమోషన్స్ ను తన నటనలో పలికించింది అందరి ప్రశంసలు అందుకుంటోందీ నాయిక.

తారలకు ఇలాంటి అవకాశం రావడం అరుదు. ఆ అవకాశాన్ని తన టాలెంట్, డెడికేషన్ తో సద్వినియోగం చేసుకుంది నభా. నాలుగు భిన్నమైన కోణాల్లో ఒకే పాత్రను పోషించి సర్ ప్రైజ్ చేసింది నభా నటేష్. అందమే కాదు ప్రతి ఎక్స్ ప్రెషన్ లో స్టోరీని ఆవిష్కరించింది నభా. నటిగా తనకున్న నిబద్దతను ప్రూవ్ చేసుకుంటూ...ప్రేక్షకుల్ని మైమరపించే నటనను కనబర్చింది.ఈ  సినిమా నభా నటేష్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీగా మిగిలిపోనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement