కావేరి నదిలో జానకి అస్థికల నిమజ్జనం | Legendary Singer S Janaki Last Wish Fulfilled With Cauvery Ash Immersion, Read Story Inside | Sakshi
Sakshi News home page

కావేరి నదిలో జానకి అస్థికల నిమజ్జనం

Jul 14 2026 9:02 AM | Updated on Jul 14 2026 1:22 PM

 Janaki emotionally immersed her ashes in the sacred Cauvery River

బెంగళూరు: ప్రముఖ గాయని ఎస్‌.జానకి అస్థికలను సోమవారం కర్ణాటక  శ్రీరంగపట్నంలోని కావేరి నదిలో నిమజ్జనం చేశారు. జానకి శనివారం మైసూరులో మరణించగా, ఆదివారం దహన సంస్కారాలు నిర్వహించారు. మనవరాలు అప్సర, బంధువులు వేద గురువు రమేష్‌ శర్మ ఆధ్వర్యంలో తెలుగు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అస్థికలకు నది ఒడ్డున పూజలు నిర్వహించి నదిలో నిమజ్జనం చేశారు.

జానకి సంరక్షకుడు నవీన్‌ మాట్లాడుతూ, జానకి కోరిక మేరకు ఆమె అస్థికలను కావేరీ నదిలో కలిపామని చెప్పారు. ప్రచారంలో ఉన్న వదంతులను కొట్టిపారేశారు. తాము జానకిని గృహ నిర్బంధంలో ఉంచలేదని, ఆమె ఆస్తి తమకు పంపిణీ చేయబడిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. జానకి జ్ఞాపకార్థం స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement