గ్రీన్ సిగ్నల్‌? | Bommarillu Bhaskar to Direct Nagarjuna 101st Film | Sakshi
Sakshi News home page

గ్రీన్ సిగ్నల్‌?

Jul 14 2026 1:29 AM | Updated on Jul 14 2026 1:29 AM

Bommarillu Bhaskar to Direct Nagarjuna 101st Film

హీరో నాగార్జున కొత్త సినిమా కబురు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తన వందో సినిమా ‘కింగ్‌ 100’     (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణతో బిజీగా ఉన్నారు నాగార్జున. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై అప్‌డేట్‌ రానుంది. కాగా తన 101వ సినిమా కార్యాచరణను కూడా మొదలుపెట్టారట ఆయన. ‘బొమ్మరిల్లు’ ఫేమ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ ఇటీవల నాగార్జునకు ఓ కథ వినిపించారట.

స్టోరీలైన్  నచ్చడంతో సినిమా చేసేందుకు ప్రాథమిక అంగీకారం తెలిపారట నాగార్జున. దీంతో స్క్రిప్ట్‌కు మరింత మెరుగులుదిద్దే పనిలో పడ్డారట భాస్కర్‌. పూర్తి కథ సిద్ధమైన తర్వాత మరోసారి ఫైనల్‌ నరేషన్  అయ్యాక ఈ సినిమాపై నాగార్జున తుది నిర్ణయం తీసుకుంటారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. మరి.. వీరి కాంబినేషన్  సెట్‌ అవుతుందా? భాస్కర్‌కు నాగార్జున గ్రీన్  సిగ్నల్‌ ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement