వందకోట్ల మా ఇంటి బంగారం.. ఈ జాబితాలో మొదటి సినిమా ఏదంటే? | South Indian Female Oriented Movies Top Collections Movies List | Sakshi
Sakshi News home page

South Indian Movies: మా ఇంటి బంగారం సెంచరీ.. దక్షిణాదిలో టాప్ సినిమాలివే..!

Jul 13 2026 10:10 PM | Updated on Jul 13 2026 10:12 PM

South Indian Female Oriented Movies Top Collections Movies List

సమంత లీడ్‌ రోల్లో వచ్చిన లేటేస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. రిలీజైన 23 రోజుల్లోనే వంద కోట్ల మార్క్ దాటేసింది. దీంతో టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీగా ఘనత సాధించింది. ఈ రికార్డ్‌తో సామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే సౌత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల గురించి చర్చ మొదలైంది. దక్షిణాది పరంగా చూస్తే సమంత మూవీ ఏ స్థానం దక్కించుకుందన్న చర్చ నడుస్తోంది. సౌత్‌ లేడీ ఓరియంటెడ్ మూవీస్ జాబితాలో మొదటి స్థానంలో కొత్త లోకా చాప్టర్-1 నిలిచింది. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద  అరుదైన ఫీట్‌ సాధించింది. ఈ సూపర్‌హీరో చిత్రం గతేడాది ఆగస్టులో విడుదలై ఏకంగా రూ.304 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్ట్ సృష్టించింది. దీంతో మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఆ తర్వాత రెండో స్థానంలో సమంత మూవీ మా ఇంటి బంగారం నిలిచింది. వందకోట్లకు పైగా వసూళ్లతో దక్షిణాదిలో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అనుష్క రుద్రమదేవి, కీర్తి సురేశ్ మహానటి, అరుంధతి, భాగమతి, సూక్ష్మదర్శిని చిత్రాలు నిలిచాయి. వీటిలో ఎక్కువగా స్వీటీ అనుష్క మూవీస్ ఉండడం మరో విశేషం. ఏదేమైనా సౌతిండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫీమేల్ లీడ్ చిత్రాల జాబితాలో సామ్ మూవీ రెండోస్థానాన్ని దక్కించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement