వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. టీజర్ వచ్చేసింది | Varun Tej Latest Movie Korean Kanakaraju Teaser Out Now | Sakshi
Sakshi News home page

Korean Kanakaraju Teaser: 'వీడు మామూలు కనకరాజు కాదు.. ఆసక్తిగా టీజర్'

Jul 13 2026 5:17 PM | Updated on Jul 13 2026 5:34 PM

Varun Tej Latest Movie Korean Kanakaraju Teaser Out Now

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌ చూస్తుంటే ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మా ఊరు పెనుకొండ అంటూ వరుణ్ తేజ్ డైలాగ్స్‌తో టీజర్ ప్రారంభమైంది. కొరియన్ దెయ్యం కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుందని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. కమెడియన్ సత్యతో కామెడీ సీన్స్‌ ఆకట్టకుంటున్నాయి. ఈ హారర్ కామెడీ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement