లెనిన్ సక్సెస్.. అఖిల్‌పై మెగాస్టార్ ప్రశంసలు | Megastar Chiranjeevi Praises Lenin Movie Success | Sakshi
Sakshi News home page

Chiranjeevi: లెనిన్‌పై మెగాస్టార్ ప్రశంసలు.. అఖిల్ రియాక్షన్

Jul 13 2026 4:02 PM | Updated on Jul 13 2026 4:06 PM

Megastar Chiranjeevi Praises Lenin Movie Success

‍అక్కినేని అఖిల్‌పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. లెనిన్ గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని తెలిపారు.  అఖిల్ నాకు మరో కొడుకు లాంటి వాడని అన్నారు. ప్రతి సినిమాతో అతను ఎదుగుతుండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. సక్సెస్ సాధించిన లెనిన్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.  త్వరలో 'లెనిన్' సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాని రాసుకొచ్చారు.

స్పందించిన అఖిల్...

మెగాస్టార్ ట్వీట్‌కు అక్కినేని అఖిల్‌ కూడా స్పందించారు. పెదనాన్న మీ ప్రేమ ఎప్పుడూ అమితమైంది. మీ సహకారానికి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ధన్యవాదాలు చిరంజీవి. నా కుటుంబానికి, నాకు మీరు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచారు. సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందిని రాసుకొచ్చారు.

అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ మూవీ జూలై 10న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలిరోజు రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లెనిన్.. రెండో రోజే రూ.32 కోట్లు దాటేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద లెనిన్ మూవీ సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమాకు మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement