ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓం చాప్టర్ 1– ఉదిరమ్: ది బ్లడ్ ఉడ్’. ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మమ్ముట్టి, నసీరుద్దీన్ షా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ మలేషియాలో ప్రారంభం కానుంది. ఆల్రెడీ ధనుష్‌తో పాటు ప్రధాన తారాగణమంతా మలేషియాకు చేరుకున్నారని కోలీవుడ్ సమాచారం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసేందుకు ప్లాన్ చేశారట రాజ్‌కుమార్. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 16న రిలీజ్ కానుంది.


