అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం ‘లెనిన్’ తో కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. “వస్తున్నాం.. మనోడు కొడుతున్నాడు” అంటూ ప్రమోషన్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వసూళ్ల వివరాలు పక్కన పెడితే.. అఖిల్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంతో ఆయన తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొనియాడారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) సోషల్ మీడియాలో అఖిల్‌ను అభినందించారు. హే అఖిల్ అక్కినేని ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నందుకు బిగ్ కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. థ్యాంక్యూ సార్.. ప్లీజ్ సినిమా చూడండి అని రిప్లై ఇచ్చారు.
Hey @AkhilAkkineni8 Just saw #Lenin , and apart from the FILM being GREAT , I realised that you are the BEST ACTOR in the #Akkineni family and I swear this on @iamnagarjuna 🔥🔥 Your ease is remarkable even when there’s no emotion in the scenes and in the emotional scenes you… https://t.co/az4x6dFsTL
— Ram Gopal Varma (@RGVzoomin) July 12, 2026
తాజాగా సినిమా చూసిన ఆర్జీవీ, ఎక్స్ వేదికగా తన రివ్యూని పంచుకున్నారు. ఆయన అఖిల్ నటనపై ప్రశంసలు కురిపించారు. నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. అక్కినేని ఫ్యామిలీలోనే అఖిల్ అత్యుత్తమ నటుడు అని ఆర్జీవీ పేర్కొన్నారు. సాధారణ సన్నివేశాల్లో కూడా అఖిల్ నటనలో కనిపించే ఈజ్ అద్భుతం, భావోద్వేగ సన్నివేశాల్లో అయితే అదరగొట్టేశాడని వర్మ అభిప్రాయపడ్డారు. అఖిల్‌కు ఇలాంటి అద్భుతమైన పాత్రను అందించిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.


