సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తోన్న తాజా చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ కనిపించనుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ప్రేమకథా చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులోని యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో మోహన్ బాబు యాక్షన్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకథతో పాటు మాస్ యాక్షన్ ఉన్న ఈ చిత్రం జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ చిత్రంలో నరేశ్, బ్రహ్మజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు.


