సెంచరీ కొట్టిన సమంత.. స్పెషల్ వీడియో వైరల్ | Samantha Maa Inti Bangaaram Creates record at box office history | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaaram Movie: సెంచరీ కొట్టిన సమంత.. స్పెషల్ వీడియో వైరల్

Jul 12 2026 4:42 PM | Updated on Jul 12 2026 4:58 PM

Samantha Maa Inti Bangaaram Creates record at box office history

సమంత బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఆమె లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సెంచరీ మార్క్ దాటేసింది. కేవలం రిలీజైన 23 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు రాబట్టిన తొలి ఫీమేల్ లీడ్ చిత్రంగా మా ఇంటి బంగారం నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి మహిళా తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించిందని పోస్ట్ చేశారు. దీంతో సామ్ ఫ్యాన్స్‌ సంబురాల్లో మునిగిపోయారు.

కాగా.. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ తన సొంత బ్యానర్ ట్రలాలా పిక్చర్స్‌పై నిర్మించింది. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 19న థియేటర్లలో విడుదలైన మా ఇంటి బంగారం మౌత్ టాక్‌తో కాసుల వర్షం కురిపించింది

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement