breaking news
Maa Inti Bagaaram Movie
-
ఓటీటీకి మా ఇంటి బంగారం.. ఒక్క రోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐశ్వర్య రాజేశ్ 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ' థియేటర్లలో సందడి చేయనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో సమంత మా ఇంటి బంగారం స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా వడ్డే నవీన్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు కన్నడ మూవీ ది డెవిల్ ఆసక్తిని పెంచుతోంది. దీంతో పాటు ఈ శుక్రవారం పలు హిందీ, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17 ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17 డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17 23000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17 హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17 25 ఇయర్క్ ఆఫ్ యూ(జపనీస్ సినిమా)- జూలై 17 స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18అమెజాన్ ప్రైమ్..ది బే (హాలీవుడ్ మూవీ)- జూలై 17ఆహాఓవెల్స్(తమిళ సినిమా)- జూలై 17జియో హాట్‌స్టార్.. మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17 టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18జీ5 ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) - జూలై 17 ది డెవిల్(కన్నడ సినిమా)- జూలై 17శివలోక్ కె కుండక్క మండక్క(యానిమేషన్ సిరీస్)- జూలై 17లయన్స్ గేట్ ప్లే..డెజర్ట్ వారియర్(హాలీవుడ్ మూవీ)- జూలై 17టెక్సాస్ చైన్ సా(హాలీవుడ్ మూవీ)- జూలై 17 -
వందకోట్ల మా ఇంటి బంగారం.. ఈ జాబితాలో మొదటి సినిమా ఏదంటే?
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. రిలీజైన 23 రోజుల్లోనే వంద కోట్ల మార్క్ దాటేసింది. దీంతో టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీగా ఘనత సాధించింది. ఈ రికార్డ్‌తో సామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే సౌత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల గురించి చర్చ మొదలైంది. దక్షిణాది పరంగా చూస్తే సమంత మూవీ ఏ స్థానం దక్కించుకుందన్న చర్చ నడుస్తోంది. సౌత్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ జాబితాలో మొదటి స్థానంలో కొత్త లోకా చాప్టర్-1 నిలిచింది. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అరుదైన ఫీట్ సాధించింది. ఈ సూపర్‌హీరో చిత్రం గతేడాది ఆగస్టులో విడుదలై ఏకంగా రూ.304 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్ట్ సృష్టించింది. దీంతో మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఆ తర్వాత రెండో స్థానంలో సమంత మూవీ మా ఇంటి బంగారం నిలిచింది. వందకోట్లకు పైగా వసూళ్లతో దక్షిణాదిలో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అనుష్క రుద్రమదేవి, కీర్తి సురేశ్ మహానటి, అరుంధతి, భాగమతి, సూక్ష్మదర్శిని చిత్రాలు నిలిచాయి. వీటిలో ఎక్కువగా స్వీటీ అనుష్క మూవీస్ ఉండడం మరో విశేషం. ఏదేమైనా సౌతిండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫీమేల్ లీడ్ చిత్రాల జాబితాలో సామ్ మూవీ రెండోస్థానాన్ని దక్కించుకుంది. -
మా ఇంటి బంగారం వచ్చేస్తోంది.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేడీ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్ టాక్‌తో మూడు వారంలోనూ వసూళ్లపరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఘనత సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేశారు. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్ ప్రకటించింది. థియేటర్లలో వందకోట్లు కొల్లగొట్టిన మా ఇంటి బంగారం ఓటీటీలోనూ దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. July 17th Okokkodni kodathamu chudu... Prematho abbaaa ❤️🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads… pic.twitter.com/0pgDLow1n4— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026 -
సెంచరీ కొట్టిన సమంత.. స్పెషల్ వీడియో వైరల్
సమంత బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఆమె లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సెంచరీ మార్క్ దాటేసింది. కేవలం రిలీజైన 23 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు రాబట్టిన తొలి ఫీమేల్ లీడ్ చిత్రంగా మా ఇంటి బంగారం నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి మహిళా తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించిందని పోస్ట్ చేశారు. దీంతో సామ్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు.కాగా.. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ తన సొంత బ్యానర్ ట్రలాలా పిక్చర్స్‌పై నిర్మించింది. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 19న థియేటర్లలో విడుదలైన మా ఇంటి బంగారం మౌత్ టాక్‌తో కాసుల వర్షం కురిపించింది GOLDEN CENTURY FOR #MaaIntiBangaaram 💥#MiB creates HISTORY by becoming THE FIRST EVER FEMALE LED TELUGU FILM to gross 100 CRORES Worldwide. @TralalaPictures @Samanthaprabhu2 #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads @VasanthMaringa1… pic.twitter.com/MsnP7N60o8— Tralala Moving Pictures (@TralalaPictures) July 12, 2026 Official : #MaaIntiBangaaram crosses 100 CRORES GROSS WORLDWIDE ! Her Happiness 😊 pic.twitter.com/Vs9Sls0S9M— Rajesh Manne (@rajeshmanne1) July 12, 2026 -
సమంత సూపర్బ్.. అఖిల్ షాకింగ్ కామెంట్స్
-
మా ఇంటి బంగారం జ్ఞాపకాల్లో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)
-
మా ఇంటి బంగారం.. సమంత కష్టాన్ని చూశారా?
సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఊహించని విజయాన్ని సాధించింది. ఈ హిట్‌తో పాటు సమంత అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి డబుల్ ఆనందాన్నిచ్చింది.అయితే తాజాగా మా ఇంటి బంగారం మూవీ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం సామ్ ఎంతలా కష్టపడిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ కోసం సామ్ కష్టపడిన తీరు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సీన్స్‌లో సమంత గన్ తిప్పిన విధానం హైలెట్‌గా అనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మా ఇంటి బంగారం కష్టాన్ని మీరు కూడా చూసేయండి. -
సమంతకు వింత పోటీ.. నో రిలీజ్, ఓన్లీ రీరిలీజ్!
టాలీవుడ్లో సినిమాల మధ్య పోటీ ఎక్కువ. పెద్ద సినిమాలు బరిలో లేకుంటే వారానికి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. థియేటర్స్‌లో బాగా ఆడుతున్న సినిమాకు సైతం రెండో వారం పోటీ తప్పదు. ఏమున్నా వారంలోపే బాక్సాఫీస్ లెక్కలు చూసుకోవాలి. కొన్ని సినిమాలకు మాత్రమే రెండో వారం దొరుకుతుంది. ఆ అదృష్టం సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’కు దక్కింది. ఈ నెల 19న విడుదలై, బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ చిత్రానికి పోటీగా రెండో వారం ఒక్క సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్. సమంతకు పోటీగా కొత్త సినిమాలు లేవు కానీ, ఆరు పాత సినిమాలు మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్నాయి. మహేశ్ బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ ఒక్కడు ఈ నెల 26న రీరిలీజ్ అవుతుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 4కే వెర్షన్లో ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు మంచు విష్ణు కన్నప్ప కూడా ఈ వారం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా రిలీజ్ అయి ఏడాది అవుతున్న సందర్భంగా మళ్లీ జూన్ 27న ‘కన్నప్ప’ని లిమిటెడ్ స్క్రీన్లలో రిలీజ్ చేయబోతోన్నారు.తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘హను మాన్’ త్రీడీ వెర్షన్‌ని నేడు(జూన్ 25) రిలీజ్ చేశారు. వీటితో పాటు రాజ్ తరుణ్ బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్త మావ, గబ్బర్ సింగ్, వెల్కమ్ టు ది జంగిల్(హిందీ) చిత్రాలు కూడా ఈ నెల 27న రీరిలీజ్ కాబోతున్నాయి. ఇలా సమంతకు రిలీజ్‌తో కాకుండా రీరిలీజ్ సినిమాలతో పోటీ ఎదురైంది. అయితే వీటి ప్రభావం ‘మా ఇంటి బంగారం’పై పెద్దగా ఉండకపోవచ్చు. ఈ మధ్య రీరిలీజ్ చిత్రాలకు సైతం ఆదరణ తగ్గిపోయింది. డై హార్ట్ ఫ్యాన్స్ తప్పితే సామాన్యులు రీరిలీజులకు వెళ్లడం లేదు. -
సమంత తన భర్తని ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
సమంత తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా..వీకెండ్లో పుంజుకొని, నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సామ్ నటించి చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక వారి ఆనందాన్ని రెట్టింపు చేసే గుడ్ న్యూస్ చెప్పింది సమంత. తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. బుధవారం నిర్వహించిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో ఆమె ఈ విషయాన్ని చెప్పింది. ఇదే ఈవెంట్లో తన భర్తను ముద్దుగా ఏమని పిలుస్తుందో కూడా ఆమె చెప్పింది.మా ఇంటి బంగారం చిత్రంలో సమంత తన భర్త అనిరుధ్‌ని ముద్దుగా హనీ అని పిలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజ నీజ జీవితంలో భర్త అయిన రాజ్‌ని ప్రేమగా ఏమని పిలుస్తారు అని సక్సెస్ మీట్లో సమంతను అడిగింది యాంకర్. దానికి సమంత సిగ్గు పడుతూ సమాధానం చెప్పింది. ‘రాజ్‌ని ఇంట్లో వాళ్ల అమ్మ, చెల్లి ప్రేమగా బాబు అని పిలుస్తారు. నేను కూడా అలానే పిలుస్తాను అని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పు నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, 2025లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ చేస్తున్న సమయంలోనే రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి..పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. -
మా ఇంటి బంగారం టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు (ఫొటోలు)
-
రూ. 50 కోట్ల క్లబ్బులోకి ‘మా ఇంటి బంగారం’
బాక్సాఫీస్ వద్ద ‘మా ఇంటి బంగారం’ రికార్డులు సృష్టిస్తోంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత నటించిన చిత్రమిది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడిమోరు కథ, కథనం అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. భారీ అంచనాలతో ఈ నెల 19న విడుదలైన ఈ మూవీ తొలి రోజు మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. రెండో రోజు నుంచి నెమ్మదిగా పుంజుకొని వీకెండ్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా మహిళలు ఈ చిత్రంపై ఆసక్తిని కనబరుస్తున్నారు.తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 13 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక కేవలం నాలుగు రోజుల్లోనే హాఫ్ సెంచరీ(రూ.50 కోట్లు) కొట్టి రికార్డు క్రియేట్ చేసింది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల వసూలు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి రూ. 30 కోట్ల బడ్జెట్ అయినట్లు సమచారం. ఇప్పటికే ఓటీటీ, శాటిలైట్స్, ఆడియో రైట్స్ రూపంలో రూ. 35 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక థియేటర్స్‌లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. మొత్తంగా గ్యాప్ తీసుకొని వచ్చిన సమంతకు ‘మా ఇంటి బంగారం’తో భారీ బ్లాక్ బస్టర్ దక్కింది. Your love means the world to me ❤️Thank you🙏#MaaIntiBangaaram pic.twitter.com/F26UctrDRg— Samantha (@Samanthaprabhu2) June 23, 2026 -
సమంత-నయనతార.. ఇంట్రెస్టింగ్ బాండింగ్
స్టార్ హీరోయిన్ల మధ్య ఈగోనే తొంగి చూస్తుంది కానీ సఖ్యత, స్నేహం ఉండటం అరుదు. ఇటీవల కాలంలో ఆ మార్పు వచ్చిందనే చెప్పొచ్చు. అందుకు ఉదాహరణ సమంత, నయనతారలే. వీరిద్దరూ స్టార్ హీరోయిన్లే. ఇద్దరు నిర్మాతలే. అత్యంత భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు నటి నయనతార. ఇంతకు ముందు తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోలతో జోడీ కట్టిన నటి సమంత. కాగా సమంత లీడ్ రోల్ చేసి, నిర్మించిన సినిమా 'మా ఇంటి బంగారం'. నందిని రెడ్డి దర్శకురాలు. తమిళంలోనూ 'ఎంగల్ తంగం' పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని నయనతార.. సమంతని అభినందనలతో ముంచెత్తింది.నయన్ తన ఇన్ స్ట్రాలో.. 'నీ కారణంగా నేను చాలా సంతోషపడుతున్నా సామ్. అభిమానానికి, విజయానికి నువ్వు అన్ని విధాలుగా పూర్తిగా అర్హురాలివి. మా ఇంటి బంగారం చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అని రాసుకొచ్చింది. కాగా ఇంతకు ముందు నయనతార సొంతంగా నిర్మించి, నటించిన 'కాత్తువాక్కుల రెండు కాదల్' మూవీలో సమంత మరో హీరోయిన్గా చేసింది. సమంత త్వరలో 'రక్త బ్రహ్మాండ' పేరుతో ఓ వెబ్ సిరీస్ చేయాలి. అయితే ఇది జరుగుతుందా లేదా అనేది ఇప్పటికైతే అప్డేట్ లేదు. -
మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు
-
హీరోల వల్ల కానిది సమంత చేసి చూపించింది
ఏదైనా సినిమా సరిగా ఆడకపోతే పలువురు తెలుగు దర్శకనిర్మాతలు.. నెపం ప్రేక్షకులు మీద లేదంటే రివ్యూయర్ల మీద తోసేస్తుంటారు. అంతే తప్పితే తాము సరిగా తీయలేదు, అందుకే ఆడలేదు, కలెక్షన్స్ రాలేదని మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు అలాంటి వాళ్లందరికీ సమంత చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఎందుకంటే బంగారం ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో బరువెక్కుతోంది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది?(ఇదీ చదవండి: శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్)ఒకప్పుడు సమంత స్టార్ హీరోయిన్. ప్రస్తుతానికి వస్తే హీరోయిన్గా ఓ సినిమా చేసి మూడేళ్లయింది. అది(ఖుషి) కూడా ఏమంత సరిగా ఆడలేదు. దీంతో 'మా ఇంటి బంగారం' ఆడుతుందా లేదా అనే విడుదలకు ముందు చాలా సందేహాలు. మరోవైపు జూన్ నెల మధ్యలో రిలీజ్, స్కూల్స్ తెరిచేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారా అని డౌట్స్. దీనికి తోడు రివ్యూలు కూడా యావరేజ్‌గానే వచ్చాయి. కానీ సమంత తన మూవీపై అందరి అంచనాల్ని తారుమారు చేసింది. వీకెండ్ అయ్యేసరికి రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఏం బాగోలేదు. ఓ మాదిరిగా ఆడిన మూవీస్ రూ.20-30 కోట్లు కూడా రాబట్టుకోలేకపోతున్నాయి. అలాంటిది హీరోలెవరూ లేకుండా సమంత మాత్రమే లీడ్ రోల్ చేసిన చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం నిజంగా ఆశ్చర్యమనే చెప్పొచ్చు. ఇది చూసి చాలామంది మిడ్ రేంజ్ హీరోలు కచ్చితంగా కళ్లుకుంటారేమో. ఎందుకంటే తమకు సాధ్యం కానిది ఓ హీరోయిన్ చేసి చూపించింది. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే కంటెంట్ ఓ మాదిరిగా ఉన్నా జనాలు ఆదరిస్తారు. కాకపోతే అవసరం ఆర్భాటాలు లేకుండా కరెక్ట్‌గా తీయాలంతే. దర్శకనిర్మాతలు ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్.మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ అంటే అనుష్క 'అరుంధతి'కి రూ.68 కోట్లు వచ్చాయి. 'మా ఇంటి బంగారం' జోరు చూస్తుంటే ఈ నంబర్ దాటేసేలా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే రికార్డ్ అవుతుంది. ఈ మూవీతో సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. అధికారికంగా చెప్పనప్పటికీ బేబీ బంప్ వీడియోలు వైరల్ కావడంతో ఈ సంగతి బయటపడింది. (ఇదీ చదవండి: సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌కి మెమో) -
సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి
హీరోయిన్ సమంత గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. తాజాగా 'మా ఇంటి బంగారం' సినిమాతో చాన్నాళ్ల తర్వాత వచ్చి సక్సెస్ అందుకుంది. అయితే సమంత ఓ రోజు రాత్రంతా నిద్రపోకుండా తనకు ఎలాంటి సపర్యాలు చేసిందో రాజ్ సోదరి శీతల్ బయటపెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్)'సమంత-రాజ్ పెళ్లయిన తర్వాత కొన్నిరోజుల తర్వాత వాళ్లింటికి వెళ్లాను. ఓరోజు అర్థరాత్రి వాంతులు, తలనొప్పి కారణంగా నేను మంచం కూడా దిగలేని పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యామిలీ గ్రూప్‌లో నా గురించి మెసేజ్ పెట్టగా.. సమంత తాను వస్తున్నట్లు చెప్పింది. మందులు, నీళ్లు తీసుకుని తనే వచ్చింది. దుప్పట్లు లేకపోతే నాపై టవర్స్ కప్పింది. ఆ టైంకి సమంతకి చాలా పనులున్నాయి. ఉదయం షూటింగ్ ఉంది. కానీ రాత్రంతా నిద్రపోకుండా నా ఆరోగ్యాన్ని గమనిస్తూనే ఉంది. అందుకే ఇప్పటికీ బాధగా ఉంది''సమంత సినిమాలు నేను ఎప్పుడూ చూడలేదు. కానీ తర్వాతి రోజు సెట్‌కి వెళ్లాను. అప్పుడు సమంత చీరలో స్టంట్స్ చేస్తూ నవ్వుతూ కనిపించింది. బ్రేక్ టైంలో నా దగ్గరికి వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉంది? అని అడిగింది. ఆమె ముఖంలోని ఆందోళన నాకు ఇప్పటికీ గుర్తుంది. రాత్రంతా నిద్రపోకుండా ఎలా నటిస్తోందో అనిపించింది. సినిమాలో ఆ సీన్స్ చూసినవాళ్లెవరికీ ఆమె అలసట గురించి తెలీదు. ఆ నవ్వు వెనకున్న సున్నితమైన మనసు గురించి తెలీదు' అని శీతల్ రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sheetal Nidimoru (@sheetalnidimoru) -
సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్
చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చిన సమంత.. బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తోంది. టాక్ ఓ మాదిరిగా వచ్చినప్పటికీ, స్కూల్స్ కూడా తెరిచేసినప్పటికీ ఫ్యామిలీ ఈ మూవీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదంతా కలెక్షన్స్ రూపంలో కనిపిస్తోంది. రెండు రోజుల్లో ఊహించని వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయి?(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఇందులో హీరో ఎవరూ లేరు. నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సామ్ భర్త రాజ్ నిడిమోరు, స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. విడుదలకు ముందు ఓ మాదిరి హైప్ ఉన్నప్పటికీ థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత మంచి వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ రాగా.. రెండు రోజులకు కలిపి రూ.28 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే రెండో రోజు ఏకంగా దాదాపు రూ.15 కోట్లు వచ్చినట్లే.ఈ నంబర్స్ బట్టి సమంత సినిమా.. తొలి రెండు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. ఈ సినిమా సక్సెస్ అవడంతో పాటు సమంత జీవితంలోనూ మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెన్సీతో ఉంది. శనివారం జరిగిన సక్సెస్ సెలబ్రేషన్లో బేబీ బంప్‌తో కనిపించింది. ఈ ఏడాది డిసెంబరులోనే బిడ్డకు జన్మనివ్వబోతుందని కూడా మాట్లాడుకుంటున్నారు. గతేడాది డిసెంబరులో దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత పెళ్లి చేసుకుంది.(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్) -
ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్.. ఈ వారం హిట్ బొమ్మ ఏది?
ఈ వారం టాలీవుడ్లో అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో పాటు పదేళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’కూడా ఉంది. వీటితో పాటు యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన లవ్‌స్టోరీ ‘దీవాన’, ‘బిచ్చగాడు’ఫేం విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’, మలయాళ మూవీ ‘బాలన్-ది బాయ్’ సినిమాలు కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాల కథేంటి? ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి? పూర్తి రివ్యూస్‌ని ఒక్క క్లిక్‌తో చదివేయండి.1) ‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘బాలన్- ది బాయ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘దీవాన’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్
హీరోయిన్ సమంత ప్రెగ్నెన్సీతో ఉందనే రూమర్స్ గత రెండు మూడు రోజుల నుంచి వచ్చాయి. అయితే 'మా ఇంటి బంగారం'తో నిన్ననే థియేటర్లలోకి వచ్చిన సామ్.. వరసగా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ బేబీ బంప్‌తో కనిపించి పుకార్లని నిజం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?)చెన్నైకి చెందిన సమంత.. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉంది. మధ్యలో మయోసైటిస్ వ్యాధి వల్ల రెండేళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత.. గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే.ఇప్పుడు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చింది. థియేటర్లలో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. మూవీ సక్సెస్‌ని శనివారం టీమ్ అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో సమంత బేబీ బంప్‌తో కనిపించింది. ఈమె సన్నిహితులు ప్రెగ్నెన్సీ అని చెప్పారు కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)Not everyone can make a cake-cutting look like a queen's victory parade... Samantha can 👑🎂❤️🔥✨#Samantha #SamanthaRuthPrabhu #MaaIntiBangaaram pic.twitter.com/bHypABnDKP— Cinewoods (@Cinewoodsoffl) June 20, 2026 -
షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈమె భర్త రాజ్ నిడిమోరు కథ అందించగా, సమంత లీడ్ రోల్ చేయడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించింది. ఓ మాదిరి అంచనాలతో నిన్న(జూన్ 19) థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరి తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయి? సమంత ఎలాంటి మ్యాజిక్ చేసింది?(ఇదీ చదవండి: రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా: సమంత)నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లకే తాను మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డట్లు సమంత బయటపెట్టింది. ఆ టైంలోనే విజయ్ దేవరకొండతో 'ఖుషి' చేసింది. తర్వాత మళ్లీ సినిమాలు చేయడం మానేసింది. గతేడాది వచ్చిన 'శుభం'తో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు 'మా ఇంటి బంగారం'తో హీరోయిన్గా కమ్ బ్యాక్ ఇచ్చింది.'బాషా' టెంప్లేట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫస్టాప్ బాగున్నప్పటికీ సెకండాఫ్‌లో కొన్ని మైనస్‌లు ఉన్నాయని చూసినోళ్లు చెబుతున్నారు. ఇలా టాక్ సంగతి పక్కనబెడితే తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్ వైరల్ అవుతుంది. సమంతకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే ఇంకా ఈమెకు కాస్తోకూస్తో మార్కెట్ బాగానే ఉందని చెప్పొచ్చు. వీకెండ్ నిలబడిన దానిబట్టి లాభాలు రావడం లేనిది క్లారిటీ వస్తుంది.'మా ఇంటి బంగారం' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో స్వర్ణ(సమంత) అనాథాశ్రమంలో పెరుగుతుంది. ఓ పెద్దింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో చెప్పకుండా వివాహం చేసుకున్నాడని అనిరుధ్‌ని అతడి కుటుంబం దూరం పెట్టేస్తుంది. తన కారణంగానే దూరమైన కుటుంబాన్ని తన భర్తకు మళ్లీ తిరిగివ్వాలనేది స్వర్ణ కోరిక. ఇంతలో ఆ ఇంట్లో ఓ శుభకార్యం కలిసొస్తుంది. అలా తొలిసారి అత్తారింట్లోకి అడుగు పెడుతుంది స్వర్ణ. అత్త ఇంటి ఆచారాలు, కట్టుబాట్లు ఏమాత్రం తెలియని స్వర్ణ ఎలాగైనా అన్నీ నేర్చేసుకుని అందరి ప్రేమని పొందాలనుకుంటుంది. అందుకోసం ఏం చేసింది? ఆమెని వెంటాడిన గతం వల్ల ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది? ఇంతకీ ఆమె గతమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ) -
తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటించాల్సింది : సమంత
నటి సమంత. ఈ పేరే ఒక సంచలనం. కథానాయకిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా, అగ్ర కథానాయికిగా రాణిస్తుంది మాత్రం టాలీవుడ్ లోనే. అక్కడ స్టార్ హీరోలందరితోనూ జత కట్టేశారనే చెప్పాలి. కాగా వెబ్ సిరీస్ ద్వారా ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం అయిన సమంత ఇటీవల నిర్మాతగానూ అవతారమెత్తారు. తొలి ప్రయత్నంగా శుభం అనే చిత్రాన్ని నిర్మించారు. మలి ప్రయత్నంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై తన భర్త రాజ్ నిడిమోరు తో కలిసి నిర్మించి, నాయకిగా నటించిన చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలోనూ ఎంగళ్ తంగం పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సామ్ తన చిత్ర టీమ్ తో చెన్నైలో సందడి చేశారు. ఈ సందర్భంగా నటి సమంత మాట్లాడుతూ ‘‘చెన్నై తనకు ఎప్పుడూ ప్రత్యేకమే. సత్యం ధియేటర్, ఈ పక్కనే నేను చదివిన కళాశాల ఇవన్నీ మంచి మెమోరీస్. తమిళంలో మరిన్ని చిత్రాలు చేసి ఉండాల్సింది. అయినా ఇంకా చాలా కాలం ఉంది. తమిళంలో మంచి కథా చిత్రాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇక ఎంగళ్ తంగం చిత్రం విషయానికి వేస్తే చిత్రాన్ని నిర్మించడం, విడుదల చేయడంలో నిర్మాతల కష్టం తెలీసి వచ్చింది. అయినా మంచి చిత్రం చేశారనే సంతోషం కలిగింది. ఇది యాక్షన్ తో కూడిన అనుబంధాలు మేళవించిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో ప్రేక్షకులను అలరిస్తాయి. ఎలాంటి కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారని అడుగుతున్నారని, అయితే మంచి జనరంజకమైన కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు పాటలు సన్నివేశాల్లో నటించడం కంటే యాక్షన్ సన్నివేశాల్లో నటించడమే ఈజీగా ఉందని అన్నారు. ఎంగళ్ తంగం చిత్రం బాగా వచ్చిందని సమంత చెప్పారు. కాగా ఈమె పనిలో పనిగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా
సమంత ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా వరస సినిమాలు చేసింది. కానీ విడాకులు, మయోసైటిల్ వ్యాధి దెబ్బకు కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. చివరగా 'ఖుషి' మూవీలో కనిపించింది. చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం'తో వచ్చింది. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే కొన్నాళ్ల క్రితం సామ్ బాగా బక్కచిక్కిపోవడం చూసి అంతా షాకయ్యారు. అయితే దాని వెనకున్న కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమె బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా 'అతిరథి' తెలుగు రివ్యూ)'ఎందుకు అంతలా బరువు తగ్గిపోయావని.. చాలామంది ఎప్పుడూ నన్ను అడుగుతుంటారు. అవతలి వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు. నేను కావాలని డైటింగ్ చేసి బరువు తగ్గలేదు. నాకు తినాలని ఉన్నా కూడా తినలేని పరిస్థితి. అందుకే తినలేకపోయాను. అనారోగ్యం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆ రెండేళ్లు నా తిండిపై ఎన్నో కండీషన్స్ ఉన్నాయి. ఏం తిన్నా సరే నా కడుపు చెడిపోయేది. మయోసైటిస్ మళ్లీ ఎక్కువయ్యేది. అందుకే రెండేళ్ల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకే రకమైన ఎలాంటి రుచి లేని ఆహారాన్ని తిన్నా. ఆ నరకు చూసిన తర్వాత నా డైట్లో చేర్చుకోవడానికి డాక్టర్స్ పర్మిషన్ ఇచ్చిన మొదటి స్వీట్ ఐటమ్.. పంచదార, డెయిరీ లేని జెలాటో ఐస్‌క్రీమ్. ఆ టైంలో దీనికోసం ఎంతో ఎదురుచూసేదాన్ని. అందుకే దాని పేరుని నా పిల్లికి పెట్టుకున్నాను''కెరీర్లో పీక్ స్టేజీలో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నా కెరీర్ ముగింపు చూశాను. అది నన్ను చాలా మార్చింది. ఒకవేళ మళ్లీ ఇండస్ట్రీకి వస్తే నా పాత పద్ధతులను, లైఫ్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆహారం పట్ల నాకున్న ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆ కష్టమైన ఫేజ్ నుంచి బయటపడి, కాస్త కంఫర్టబుల్‌గా తినగలుగుతున్నాను' అని సమంత చెప్పుకొచ్చింది.నందిని రెడ్డి దర్శకత్వం వహించిన 'మా ఇంటి బంగారం' సినిమాలో సమంతనే మెయిన్ లీడ్. ఈమె భర్త రాజ్ నిడిమోరు.. స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. అయితే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. మరి బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు నిలబడుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ) -
ముఖ్యమంత్రిగా విజయ్.. ముందే ఊహించిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం బుధవారం చెన్నై వెళ్లిన సమంత.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ని కూడా కలిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: హీరోయిన్-సీఎం విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)'చెన్నై చేరుకోగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యమంత్రి విజయ్‌ని కలిసే అవకాశం రావడం మరింత ప్రత్యేకంగా అనిపించింది. ఈయన హీరోగా మాత్రమే పరిమితం కావాల్సిన వ్యక్తి కాదు, ఈయన వ్యక్తిత్వం, ప్రజలతో ఏర్పడిన అనుబంధం చూసిన తర్వాత విజయ్ మరింత పెద్ద బాధ్యతలు అందుకుంటారని అనిపించేది. కెరీర్ పరంగా పీక్‌లో ఉన్నప్పుడు నటన వదిలేసి మరిన్ని సవాళ్లు, బాధ్యతలున్న కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ధైర్యంతో కూడిన పని''సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, విజయ్ నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తోంది. జీవితంలో ఒక దశలో ప్రతి ఒక్కరికీ తమకోసం మాత్రమే కాకుండా సమాజం కోసం కూడా ఏదైనా చేయాలనే పిలుపు వస్తుంది. ఆ పిలుపునకు స్పందించే వారు చాలా అరుదు.విజయ్ ఇప్పటికే ఆయనను విశ్వసిస్తున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నారనే నమ్మకం ఉంది. ఆయన విజయం కేవలం పదవి వల్ల కాకుండా ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత, స్పష్టమైన ఉద్దేశ్యంతోనే సాధ్యమవుతుంది' అని సమంత రాసుకొచ్చింది.యువతకు విజయ్ గెలుపు ఒక ప్రేరణగా నిలవాలని, జీవితంలో ప్రారంభంలో కలలు కన్న దానికంటే ఎంతో పెద్ద లక్ష్యాలను సాధించే అవకాశాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయని సమంత చెప్పుకొచ్చింది. సమంత పోస్ట్ బట్టి చూస్తే విజయ్‌తో కలిసి నటిస్తున్న టైంలోనే ముఖ్యమంత్రి లాంటి పెద్ద పొజిషన్‌కి వెళ్తారని ఊహించింది. ఇప్పుడు అది నిజమవడంతో ఆయన్ని కలిసి ఆనందం వ్యక్తం చేసింది. విజయ్-సమంత.. కత్తి, మెర్సల్, తెరి మూవీలో నటించారు.(ఇదీ చదవండి: ముఖ్యమంత్రి విజయ్ ని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
శ్రీముఖి నీ పెళ్లెప్పుడు?.. యాంకర్ ఫుల్ క్లారిటీ..!
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న మా ఇంటి బంగారం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తళుక్కున మెరిసింది. పట్టుచీరలో కనిపించి తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌కు హాజరైన శ్రీముఖిని మరో స్టార్ యాంకర్ సుమ తన ప్రశ్నలతో చిక్కుల్లో పడేసింది.మామూలుగా బంగారం ఎప్పుడు కొంటారని శ్రీముఖిని సుమ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ పెళ్లిళ్ల సమయంలో బంగారం ఎక్కువగా కొంటారని చెప్పింది. మరి నీ పెళ్లెప్పుడు అంటూ సుమ మరో ప్రశ్న వేసింది. దీనికి శ్రీముఖి సరదాగా సమాధానం ఇచ్చింది. సమంతను చూపిస్తూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజై పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యాక నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నా అని నవ్వుతూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. దీంతో శ్రీముఖి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సమంత నటించిన 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీముఖ కీలక పాత్ర పోషించింది. -
ఆ టైమ్‌లో నాలో అహంకారం పెరిగింది: సమంత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకులను పలకరించనుంది. తన సొంత బ్యానర్లో ఈ మూవీని నిర్మించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో సామ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఒక సమయంలో స్టార్డమ్ అనే మత్తుకు బానిసయ్యానని సమంత చెప్పుకొచ్చింది. తన సినిమాలు వరుస హిట్స్ కావడంతో నాలో అహంకారం కూడా మెల్లగా పెరుగుతూ వచ్చిందని సామ్ పేర్కొంది. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ అమ్మాయికి స్టార్డమ్ దక్కడం నాకే ఆశ్చర్యంగా అనిపించిందని వెల్లడించింది. ఓకే ఏడాదిలో ఐదు సినిమాలు చేశా.. అన్నీ హిట్ కావడంతో నాది ‘గోల్డెన్ లెగ్’ అని అందరు అనేవారని గుర్తు చేసుకుంది. అలా నాపై ఒత్తిడి కూడా పెరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నా.. నటిగా నా కెరీర్లో ముగింపు ఉండదనుకున్నానని సామ్ తెలిపింది.అయితే అనారోగ్యం, సినిమాలకు బ్రేక్ రావడం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని సమంత తెలిపింది. అప్పుడే తిరిగి సినిమాల్లోకి వస్తే కొన్ని పాత అలవాట్లు మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని వెల్లడించింది. విరామం తర్వాత తన జీవితం, కెరీర్‌ను కొత్త కోణంలో చూసేలా చేసిందని పేర్కొంది. కాగా.. 2022 నుంచి సామ్ మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. -
పెళ్లయిపోయింది.. మిగిలింది అదొక్కటే
సాధారణంగా హీరో లేదా హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత అదృష్టం కూడా కలిసొస్తుందని అంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే పలువురు హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత హిట్స్ కొడుతుంటారు. జీవితంలోనూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు రష్మిక, సమంత కూడా పెళ్లి తర్వాత సక్సెస్ అందుకుంటారా? ఒకేవారం రిలీజ్ అవుతున్న వీళ్ల సినిమాలపై హైప్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)సమంత గురించి మాట్లాడుకుంటే తెలుగులో ఒకప్పుడు మహేశ్ బాబు, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. స్టార్డమ్ అనుభవించింది. కానీ హీరో నాగచైతన్యతో విడాకులు, తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం లాంటివి జరిగేసరికి నటించడం చాలావరకు తగ్గించేసింది. హీరోయిన్గా అయితే చివరగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి'లో కనిపించింది. ఇది ఫ్లాప్ అయింది. దీని తర్వాత ఓ సిరీస్ చేసింది గానీ ఇదీ వర్కౌట్ కాలేదు.ఇక గతేడాది 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ బడ్జెట్ పరంగా సేఫ్ అయిపోయింది. గతేడాది చివరలో డైరెక్టర్ రాజ్ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకుంది. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' అనే సినిమాని పూర్తి చేసింది. పలుమార్లు వాయిదా పడి ఈ వారమే ఇది థియేటర్లలోకి రానుంది. మార్కెట్లో అయితే దీనిపై పెద్దగా హైప్ అయితే లేదు. సమంత కోసమే ఈ మూవీకి ఆడియెన్స్ రావాలి. అలానే కంటెంట్ కూడా అదిరిపోయిందనే టాక్ రావాల్సి ఉంటుంది. 'పెద్ది' కూడా నెమ్మదించింది కాబట్టి పాజిటివ్ టాక్.. సమంత 'బంగారం'కి చాలా కీలకం. మరి పెళ్లి సామ్‌కి హిట్ రూపంలో అదృష్టాన్ని తీసుకొస్తుందేమో చూడాలి?రష్మిక విషయానికొస్తే కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉంది. ఇలాంటి టైంలో పెళ్లి గురించి సాధారణంగా హీరోయిన్లు ఆలోచించారు. కానీ ఈమె ఆలోచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసింది. ఇది జరగడానికి ముందే హిందీలో 'కాక్టెయిల్ 2' అనే మూవీ చేసింది. ఓ కుర్రాడు ఇద్దరమ్మాయిలని ప్రేమించడం, వీళ్ల ముగ్గురు కలిసే ఉండటం అనే బోల్డ్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాకి ప్రస్తుతానికి హిందీలో మాత్రమే బజ్ ఉంది. తెలుగులో రిలీజ్ చేయట్లేదు. ఇప్పటివరకు యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. ఇందులో పూర్తిగా గ్లామర్ షో చేసింది. పెళ్లి తర్వాత ఈమె నుంచి వస్తున్న తొలి చిత్రమిదే. మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్) -
'ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నా'.. సమంత భర్త ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ తన సొంత బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ నటన ఆకట్టుకుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సామ్ భర్త రాజ్ నిడిమోరు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నిడిమోరు ఆసక్తికర కామెంట్స్ చేశారు. హిందీలో చాలా సినిమాలు చేశానని.. కానీ ఈ మూవీకి వస్తున్నంత రెస్పాన్స్ ఎక్కడా చూడలేదన్నారు. తిరుపతి నుంచి నాకు ఫోటోలు వస్తున్నాయి.. మా అమ్మ కాలేజీ దగ్గర హోర్డింగ్స్ పెట్టారని తెలిసింది. నేను ఫస్ట్ టైం ఇంత హడావిడి చూస్తున్నానని రాజ్ నిడిమోరు ఆనందం వ్యక్తం చేశారు. . -
రాజ్ నా లైఫ్ లోకి వచ్చిన తరువాత జరిగింది ఇదే...
-
అప్పుడు మా ఇంట్లోవాళ్లే నన్ను ట్రోల్ చేశారు: సమంత
సమంత.. వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తోంది. ఆమె హీరోయిన్గా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సమంత. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోసం ఓ అభిమాని గుడి కట్టిన విషయం తెలిసిన తర్వాత ఏం జరిగిందో వివరించింది.ఆంధ్రప్రదేశ్‌ని బాపట్లకు చెందిన ఓ వీరాభిమాని సమంత కోసం 2023లో ఓ గుడి కట్టిన విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే గుడి కట్టారనే విషయం తెలిసి తాను కూడా షాకయ్యానంటోంది సమంత.‘గుడి కట్టించుకునేంత అర్హత నాకు లేదు. నేనేం స్పెషల్ కాదు. ఇంతమంది అభిమానుల ప్రేమను పొందే అదృష్టం ఆ దేవుడు నాకిచ్చాడు. అంతేకాని నేను అంత గొప్పదాన్ని ఏం కాదు. ఇలా గుడి కట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఆ అభిమానితో నేను మాట్లాడాను. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆయన ఆ గుడి కట్టి పూజలు చేశాడట. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడట. ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. అయితే గుడి కట్టిన విసఁం తెలిసిన తర్వాత మాత్రం మా ఇంట్లోవాళ్లు, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. నీకోసం గుడి కట్టారట అంటూ ఇంట్లో వాళ్లే ట్రోల్ చేశారు(నవ్వుతూ..)’ అని సమంత చెప్పుకొచ్చింది. -
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ HD స్టిల్స్
-
పెళ్లి తర్వాత ఆ మూవీస్ పైనే ఫోకస్
-
ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. మాస్ యాక్షన్‌లో సమంత
సమంత లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేట్ చేశారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత పెద్దగా మాట్లాడలేదు. తన టీమ్‌కి ఎక్కువ అవకాశమిచ్చింది. తాను మాట్లాడిన కొన్ని మాటలు కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడింది. ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందనకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం తన భర్త రాజ్ గురించి మాట్లాడుతూ 'రాజ్‌తో ఇప్పటివరకు ఎలాంటి వాదన జరగలేదు. ఆయన చాలా పర్ఫెక్ట్' అని ప్రశంసించింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి హీరోయిన్ చేసే పోరాటం, సాహసాలు ప్రధానంగా చూపించారు. సమంతకు ప్రత్యేకమైన బ్యాక్‌స్టోరీ కూడా జోడించారు. యాక్షన్ సీన్స్‌లో సమంత తన స్టంట్స్‌తో ఆకట్టుకుంది. 'ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. ప్రేమతో అబ్బా' అనే డైలాగ్ ట్రైలర్లో బాగా పేలింది.ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం ఇచ్చింది. ట్రైలర్ ద్వారా సినిమా కథ ఎలా ఉంటుందో దాదాపుగా స్పష్టమైంది. ఇక మిగిలిన ఆసక్తికరమైన మలుపులు వెండితెరపై చూడాల్సిందే. -
అల్లు అర్జున్ ఇంటికి పిలిచి తిట్టాడు : నందినిరెడ్డి
తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది దర్శకురాలు నందిని రెడ్డి. తొలి సినిమా ‘అలా మొదలైంది’తోనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ నూతన దర్శకురాలిగా నంది అవార్డుని సైతం గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు నిరాశ పరిచినా.. ఓ బేబీ మూవీతో మళ్లీ భారీ విజయాన్ని అందుకుంది. అందులో ప్రధాన పాత్రలో నటించిన సమంతతో ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కించింది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. నందినిరెడ్డికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ఆమెను ఘోరంగా తిట్టాడని ఆ వార్త సారంశం. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా నందిని రెడ్డే చెప్పింది. బన్నీ ఎందుకు తిట్టాల్సి వచ్చింది? అసలేం జరిగింది?సినిమా ఫ్లాప్నందినిరెడ్డి దర్శకురాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్లో తన ప్రయాణం కొనసాగించింది. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి… రెండేళ్ల గ్యాప్ తీసుకొని ‘జబర్దస్త్’ అనే మూవీతో ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. సిద్ధార్థ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రం 2013లో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నందినిరెడ్డి కొన్నాళ్ల పాటు ఇంటి నుంచి బయటకే రాలేదట. దాదాపు మూడు నెలల వరకు ఇంట్లోనే ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో నందిని చెప్పింది. బన్నీ తిట్టాడు..అయితే ఈ విషయం తెలిసి అల్లు అర్జున ఆమెని తిట్టాడట. ‘ఓ రోజు అల్లు అర్జున్ ఇంటికి రమ్మని కబురు పంపాడు. నేను ఇంటికి వెళ్లగానే ఘోరంగా తిట్టాడు. ‘ఇచ్చింది ఒకటే ఫ్లాప్.. దాని కోసం ఇంట్లో ముడుచుకొని కూర్చుంటారా? నెక్ట్స్ సినిమా ప్లాన్ ఏంటి? కథేంటి? అని అడిగితే.. నేను బిత్తరపోయా. అసలు స్టోరీ ఏదైనా రాశావా లేదా అని అడిగాడు. రాశానని చెప్పా. వెళ్లి తీసుకొని రా. వన్‌లైన్ ఆర్డర్ తీసుకురా. నాకు నెరేషన్ ఇవ్వు. నా ఓపీనియన్ చెబుతా’ అని అలా ఎంకరేజ్ చేశాడు. బన్నీ నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాడు’ అని నందిని రెడ్డి చెప్పుకొచ్చింది. -
ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన సమంతని ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ.. వాటి కంటే విడాకులు, ఆరోగ్య సమస్యలు, రెండో పెళ్లి తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం' మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది. అలానే మంగళవారం ఈమె పుట్టినరోజు కూడా. ఇంతలోనే చిన్నపాటి షాకిచ్చింది. తన దగ్గర ఇప్పుడేముంది? వేటిని వదులుకున్నానని ఓ పోస్ట్ రూపంలో బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)పని మీద ప్రేమ, నడిపించే శక్తి, మనసు చెప్పే విషయం, సంకల్పం, నమ్మిన నిజం, ఓ లక్ష్యం తనతో పాటు ఉన్నాయని చెప్పుకొచ్చిన సమంత.. ఎవరో వచ్చి ఎంపిక చేస్తారని ఎదురుచూడటం, నియంత్రించే ఆలోచన, నచ్చినట్లు ఉండాలనుకునే లక్షణం, పట్టుకుని వేలాడటం, హడావుడి పడటం లాంటి అంశాలని వదిలేశానని తెలిపింది. ఇందుకు సంబంధించి నాలుగు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.చూస్తుంటే సమంత.. గత కొన్నేళ్లలో తన జీవితంలో జరిగిన సంఘటనలు, వాటి వల్ల తనలో వచ్చిన మార్పుల గురించి పరోక్షంగా ఈ పోస్టుతో చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఇక 'మా ఇంటి బంగారం' విషయానికొస్తే.. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ఇది. ఓ ఇంటికి కోడలిగా వచ్చిన హీరోయిన్(సమంత).. రౌడీలని ఎందుకు చితక్కొట్టాల్సి వచ్చిందనేది కాన్సెప్ట్. ఈ చిత్రానికి సామ్ భర్త రాజ్ నిడిమోరు స్టోరీ, నిర్మాణ పరంగా సహకారం అందించారు.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
‘తస్సాదియ్యా’.. సమంత డ్యాన్స్ అదిరిందయ్యా!
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీకి సమంత స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు మేకర్స్. 'తస్సాదియ్యా... తగ్గేదీ లేదు హొయ్య. అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే...' అంటూ సాగే ఈ పాటకి రెహమాన్ లిరిక్స్ అందించగా చిన్మయి, పుణ్య సెల్వ అద్భుతంగా ఆలపించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక చీరకట్టులో సమంత వేసిన స్టెప్పులు హైలెట్ అని చెప్పొచ్చు. -
సమంత ఉగాది పచ్చడి .. భర్త రాజ్ షాకింగ్ కామెంట్..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఆమె పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ జరిగింది. పవిత్రమైన భూతశుద్ధి పేరుతో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వివాహానికి కొద్దిమంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.అయితే ఇవాళ ఉగాది కావడంతో సామ్ సైతం పండుగను సెలబ్రేట్ చేసుకుంది. యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి ఉగాది పచ్చడి చేసింది. ఈ సందర్భంగా తన భర్త రాజ్ నిడిమోరుకు లైవ్‌లో ఫోన్ చేసి మాట్లాడింది. ఉగాది పచ్చడి చేశానంటూ తన భర్తకు చెప్పింది. నువ్వు చేశావా? అంటూ రాజ్ అనడంతో పక్కనే ఉన్న సుమ, నందిని నవ్వు ఆపుకోలేపోయారు. అంతకుముందు సామ్.. హాయ్ బాబు అని రాజ్‌ను ముద్దుపేరుతో పిలవడంతో యాంకర్ సుమ ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది.కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. -
సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్
సమంత.. టాలీవుడ్లో ఈ పేరు వినిపించి చాలాకాలమైపోయింది. ఆరేడేళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసి హీరోయిన్గా స్టార్డమ్ అనుభవించిన ఈమె.. నాగచైతన్యకు విడాకులు ఇవ్వడం, మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటంతో పూర్తిగా మూవీస్ చేయడం తగ్గించేసింది. మూడేళ్ల క్రితం అంటే 2023లో విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' చేసింది. ఇదేం పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు పోస్ట్ పెట్టింది.నటిగా అలరించిన సమంత.. ట్రలాలా పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించింది. 'శుభం' అనే సినిమాతో గతేడాది ప్రేక్షకుల్ని పలకరించింది. ఇది ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈమెనే నిర్మాత కమ్ లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'.. థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అసలు ఈ చిత్రం ఒకటుందని ఆడియెన్స్‌కి గుర్తులేదు. అలాంటిది ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించి అందరికీ సామ్.. సర్ప్రైజ్ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. పాతిరాత్రి రివ్యూ)నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత చాన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న సామ్.. 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్లలో ఒకటైన రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు. అయితే గతేడాది వీళ్ల ప్రేమ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సామ్ ఏమైనా విశ్రాంతి తీసుకుంటుందేమో అనుకుంటే.. 'మా ఇంటి బంగారం' సినిమాని రెడీ చేసింది.నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత.. ఓ సంప్రదాయ ఇల్లాలి పాత్రలో కనిపించనుంది. అలానే ఆపద వచ్చినప్పుడు యాక్షన్‌తో అదరగొట్టే పాత్రలోనూ కనిపించనుండటం విశేషం. కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన టీజర్‌తో స్టోరీ ఏంటో చూచాయిగా క్లారిటీ వచ్చింది. ట్రైలర్ వస్తే అసలు కథేంటో తెలుస్తుంది. మరి ఈ మూవీతో సమంత కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
భర్త కోసం పేరు మార్చుకోనున్న సమంత.. కొత్త పేరేంటో తెలుసా?
సమంత రూత్‌ప్రభు.. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ఇటీవల సొంత ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేసి.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’గతేడాది మేలో రిలీజై మంచి విజయాన్ని సాధించింది. మరోవైపు హీరోయిన్గా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా కూడా చేస్తుంది. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గుడపుపుతోంది.నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న సామ్..ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఎక్కువ సమయం భర్తతో గడిపేందుకు కేటాయిస్తుంది సామ్. వీలైనంత వరకు ఇద్దరు కలిసే బయటకు వెళ్తున్నారు. ఏదైనా ఈవెంట్ ఉన్నా.. జంటగా హారవుతున్నారు. దాంతప్య జీవితమే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా ఇద్దరు కలిసే షేర్ చేసుకుంటున్నారు. సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇలా పెళ్లి తర్వాత రాజ్ నిడిమోరు- సమంత జంట అటు దాంపత్య జీవితాన్ని, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ని ఆనందంగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో భర్త రాజ్ నిడిమోరు కోసం సామ్ కీలక నిర్ణయం తీసుకుందంటూ ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భర్త కోసం తన ఇంటి పేరుని మార్చకోబోతుందట. ఇన్నాళ్లు సమంత రూత్‌ప్రభుగా ఉన్న తన పేరుని..ఇప్పుడు సమంత నిడిమోరుగా మార్చుకోబోతుందట. ‘మా ఇంటి బంగారం’ సినిమాతోనే తన కొత్త పేరుని ఫ్యాన్స్‌కి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ కార్డ్సులో సమంత పేరుని ‘సమంత నిడిమోరు’గా వేయాబోతున్నారట. అంతేకాదు తన సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఇదే పేరుని మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి సమంత నిజంగానే పేరు మార్చుకుంటుందా లేదా అనేది తెలియాలంటే.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ వరకు ఆగాల్సిందే. -
సమంత మాస్ లుక్.. సంక్రాంతికి సర్ప్రైజ్
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్‌ని స్థాపించి.. తొలి ప్రయత్నంగా 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అందుకుంది. అదే బ్యానర్‌పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఇందులో ఆమే హీరోయిన్. ‘ఓ బేబీ’ తర్వాత సామ్‌తో కలిసి నందిని రెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే దర్శకురాలు పేరు తప్ప.. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ని పంచుకుంది సమంత. (చదవండి: ఓటీటీలో తమిళ ఫీల్‌గుడ్ మూవీ.. ఎక్కడంటే?)సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని కూడా విడుదల చేశారు. ‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’ అంటూ ఆ పోస్టర్‌కి క్యాప్షన్ రాసుకొచ్చారు. జనవరి 9న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్తోన్న బ్యూటీ.. ఎప్పుడో మరి!)ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా..సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుఉతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)


