భర్త కోసం పేరు మార్చుకోనున్న సమంత.. కొత్త పేరేంటో తెలుసా? | Is Samantha Ruth Prabhu Changing Her Name To Samantha Nidimoru After Marriage, Rumours Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

భర్త కోసం పేరు మార్చుకోనున్న సమంత.. కొత్త పేరేంటో తెలుసా?

Jan 29 2026 9:28 AM | Updated on Jan 29 2026 10:42 AM

Did Samantha Ruth Prabhu Change Her Name After Marriage

సమంత రూత్‌ప్రభు.. ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ఇటీవల సొంత ప్రొడక్షన్‌ని స్టార్ట్‌ చేసి.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’గతేడాది మేలో రిలీజై మంచి విజయాన్ని సాధించింది. మరోవైపు హీరోయిన్‌గా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా కూడా చేస్తుంది. ఇలా కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గుడపుపుతోంది.

నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న సామ్‌..ఇటీవల బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఎక్కువ సమయం భర్తతో గడిపేందుకు కేటాయిస్తుంది సామ్‌. వీలైనంత వరకు ఇద్దరు కలిసే బయటకు వెళ్తున్నారు. ఏదైనా ఈవెంట్‌ ఉన్నా.. జంటగా హారవుతున్నారు. దాంతప్య జీవితమే కాకుండా ప్రొఫెషనల్‌ లైఫ్‌ని కూడా ఇద్దరు కలిసే షేర్‌ చేసుకుంటున్నారు. సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రాజ్‌ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇలా పెళ్లి తర్వాత రాజ్‌ నిడిమోరు- సమంత జంట అటు దాంపత్య జీవితాన్ని, ఇటు ప్రొఫెషనల్‌ లైఫ్‌ని ఆనందంగా గడుపుతోంది. 

ఈ నేపథ్యంలో భర్త రాజ్‌ నిడిమోరు కోసం సామ్‌ కీలక నిర్ణయం తీసుకుందంటూ ఓ క్రేజీ న్యూస్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భర్త కోసం తన ఇంటి పేరుని మార్చకోబోతుందట. ఇన్నాళ్లు సమంత రూత్‌ప్రభుగా ఉన్న తన పేరుని..ఇప్పుడు సమంత నిడిమోరుగా మార్చుకోబోతుందట. ‘మా ఇంటి బంగారం’ సినిమాతోనే తన కొత్త పేరుని ఫ్యాన్స్‌కి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా టైటిల్‌ కార్డ్సులో సమంత పేరుని ‘సమంత నిడిమోరు’గా వేయాబోతున్నారట. అంతేకాదు తన సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ ఇదే పేరుని మార్చబోతున్నట్లు  వార్తలు వస్తున్నాయి. మరి సమంత నిజంగానే పేరు మార్చుకుంటుందా లేదా అనేది తెలియాలంటే.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌ వరకు ఆగాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement