చెప్పీ చెప్పనట్లుగా... | Anand Deverakonda released Epic film Promo | Sakshi
Sakshi News home page

చెప్పీ చెప్పనట్లుగా...

Mar 16 2026 3:05 AM | Updated on Mar 16 2026 3:05 AM

Anand Deverakonda released Epic film Promo

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ఎపిక్‌’ ఒకటి. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆదివారం (మార్చి 15) ఆనంద్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో హీరో తన ఫ్రెండ్స్‌తో కలిసి లండన్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, ఇండియాలో ఉన్న అతని తల్లిదండ్రులు ఫోన్‌ చేసి, శుభాకాంక్షలు చెప్పడం చూపించారు. అయితే తండ్రి మాత్రం చెప్పీ చెప్పనట్లుగా కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెçప్పడం కనిపిస్తుంది. ‘బేబీ’ వంటి సూపర్‌ హిట్‌ మూవీ తర్వాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement