ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్‌ | CM Vijay Pays Tribute To Bharathiraja | Sakshi
Sakshi News home page

అధికారిక లాంఛానాలతో భారతీరాజా అంత్యక్రియలు.. సీఎం విజయ్‌ ప్రకటన

Jun 10 2026 12:16 PM | Updated on Jun 10 2026 12:29 PM

CM Vijay Pays Tribute To Bharathiraja

దర్శక శిఖరం భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ప్రకటించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారతీరాజా(84) మరణ వార్త వినగానే విజయ్‌ సోషల్‌ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం చెన్నైలోని భారతీరాజా నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. 

ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సతాపం తెలిపారు. విజయ్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌, సీనీ నటి సినీ నటి రాధికా, హీరో సూర్య కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement