ఈ టాలీవుడ్‌ నటుడు గుర్తున్నాడా? ఇంత పెద్ద కూతురు ఉందా? | Do You Remember This Tollywood Actor And His Wife | Sakshi
Sakshi News home page

ఈ టాలీవుడ్‌ నటుడు గుర్తున్నాడా? ఆయన భార్య కూడా స్టార్‌ నటి!

Jul 26 2026 3:22 PM | Updated on Jul 26 2026 3:27 PM

Do You Remember This Tollywood Actor And His Wife

తెలుగు తెరపై ఎందరో నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థి ర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే కొంతమంది మాత్రం సడెన్‌గా వెండితెరకు దూరం అయిపోతున్నారు. వందల సినిమాలు చేసినా.. మళ్లీ తెరపై కనిపించడం లేదు. అలాంటి వాళ్లలు నవీన్‌ ఓలేటి ఒకరు. పేరు చెబితే తెలియదు కానీ.. ప్రేమంటే ఇదేరా చిత్రంలో హీరో వెంకటేష్‌ ఫ్రెండ్‌.. విక్రమార్కుడులో పోలీసు.. తొలివలపు మూవీలో హీరో అన్నయ్య అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నువ్వే నువ్వే, విక్రమార్కుడుతో పాటు దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. 

సినిమాల కంటే ముందు బుల్లితెరపై సందడి చేశాడు. పద్మవ్యూహం’, ‘నాన్న’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో ఆయన పోషించిన పాత్రలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అతని సతీమణి కూడా నటినే. పేరు మధురిమ. ఆర్‌. నారాయణ మూర్తి దర్శకత్వం వహించిన ‘ధళం’చిత్రంతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత నరసింహనాయుడు’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ప్రేమతో రా’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. విక్రమార్కుడు చిత్రంలో రాజీవ్‌ కనకాల భార్యగా నటించింది ఈమెనే. అదే చిత్రంలో నవీన్‌.. కానిస్టేబుల్‌గా నటించాడు.

ఇలా వెండితెరపై ఆకట్టుకున్న ఈ జంట.. సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమైంది. ఈ దంపతులు ఇప్పుడు పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు ప్లిలలు (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) ఉన్నారు. పెద్ద కుమార్తె మనవి హీరోయిన్ గా రాణించేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement