‘గబ్బర్ సింగ్’ రమేష్‌కి అండగా నిలిచిన మెగాస్టార్‌ | Chiranjeevi Financial Help To Gabbar Singh Ramesh's Family | Sakshi
Sakshi News home page

‘గబ్బర్ సింగ్’ రమేష్‌కి అండగా నిలిచిన మెగాస్టార్‌

Jul 26 2026 12:03 PM | Updated on Jul 26 2026 12:13 PM

Chiranjeevi Financial Help To Gabbar Singh Ramesh's Family

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి మెగాస్టార్‌ చిరంజీవి అండగా నిలిచారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ గారు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి వెంటనే స్పందించారు.

అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రమేష్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారిని కోరారు. అంతేకాదు రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో రమేశ్‌ సతీమణికి  రూ. 3 లక్షల చెక్కును అందజేశారు.  అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని చిరంజీవి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. రమేష్  త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి గారు ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement