లెనిన్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అక్కినేని హీరో అఖిల్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్.. ఎట్టకేలకు అయ్యగారే నంబర్‌వన్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా మెప్పించింది.
లెనిన్ హిట్ కొట్టిన ఆనందంలో ఉన్న అఖిల్ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన చిన్నప్పుడు నటించిన సిసింద్రీ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా మొత్తం నా నిద్ర టైమ్ ఆధారంగానే తెరకెక్కించారని తెలిపారు. నేను ఏడవాలంటే కెమెరా వెనకాల నాన్న చేతులు ఊపేవారని అన్నారు. నేను ఏడ్చాలంటే అమ్మ బై చెప్పి కారులో వెళ్లిపోయేదని అఖిల్ వెల్లడించారు. ఇలా చిన్న చిన్న ట్రిక్స్‌తో నేను నటించానని.. అందుకే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిందన్నారు. నా లైఫ్‌లో ది మోస్ట్ యూనిక్ ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్ సిసింద్రీ మూవీనేనని అఖిల్ ఆనందం వ్యక్తం చేశారు. నా జీవితంలో సిసింద్రీ మూవీ చాలా ప్రత్యేకమని తెలిపారు.


