ఆ ఒక్క కారణం వల్లే సినిమాల్లోకి: రకుల్ ప్రీత్ సింగ్ | Tollywood actress Rakul Preet Singh about her debut into Movies | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: 'అది కొనేందుకే సినిమాల్లోకి వచ్చా'

Jul 26 2026 10:40 AM | Updated on Jul 26 2026 11:19 AM

Tollywood actress Rakul Preet Singh about her debut into Movies

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ పలు మూవీస్ చేసింది. ప్రస్తుతం రామాయణ మూవీలో కనిపించనుంది. ఇటీవల రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌కు హాజరైన రకుల్.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను సినిమాల్లోకి రావడానికి గల కారణాన్ని వివరించింది.

కేవలం కారు కొనాలనే కోరికతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్. అలా జరిగితే నా ఫ్రెండ్స్‌లో కారు కొనుక్కున్న మొదటి వ్యక్తిని నేను అవుతానని భావించానని వెల్లడించింది. అందుకే కన్నడ మూవీలో అవకాశం రాగానే ఒప్పేసుకున్నానని పేర్కొంది. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీపై తనకు ఎలాంటి అవగాహన లేదని రకుల్ పంచుకుంది.  

రకుల్ మాట్లాడుతూ..' కాలేజీలో చదువుతున్నప్పుడే కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి అవకాశం వచ్చింది. ఎవరో నా ఫొటోలు చూసి మా నాన్నని కలిశారు. ఓ సినిమాలో నటించేందుకు నన్ను తీసుకుంటామని అడిగారు. అప్పుడు నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీపై నాకు అవగాహన లేదు. అయితే ఆ సినిమాకు నాకు రూ.5 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పారు.  ఆ డబ్బులతో కారు కొనుక్కోవాలనుకున్నా. నా స్నేహితులందరిలో కారు ఉన్న మొదటి అమ్మాయిని నేనే అవుతా. ఆ ఒక్క కారణంతోనే  సినిమా చేయడానికి అంగీకరించా' అని తెలిపింది. కాగా..  2009లో కన్నడ చిత్రం గిల్లీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మూవీ టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement