నాపై ఒత్తిడి ఉండటం మంచిదే!: జై కృష్ణ | Jai Krishna about Srinivasa Mangapuram movie | Sakshi
Sakshi News home page

నాపై ఒత్తిడి ఉండటం మంచిదే!: జై కృష్ణ

Jul 26 2026 1:14 AM | Updated on Jul 26 2026 1:14 AM

Jai Krishna about Srinivasa Mangapuram movie

‘‘నేను ఫ్యాన్స్‌కి ఇంకా ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్లు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేనీ సినిమా చేస్తున్నానని తెలియక ముందు నుంచే ఘట్టమనేని అభిమానులు నన్ను స పోర్ట్‌ చేశారు. అందుకే నటుడిగా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి... నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలి. మంచి కథలు, మంచి పాత్రలు చేయాలనే ఆలోచన నాకు మొదట్నుంచే ఉంది. ఈ విషయంలో నాపై ఒత్తిడి ఉండటం మంచిదే.

అది నన్ను మంచి కథల వైపు తీసుకువెళ్తుంది’’ అని జై కృష్ణ అన్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు సోదరుడు  రమేష్‌బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాకు అజయ్‌ భూపతి దర్శకత్వం వహిం చారు. అశ్వినీదత్‌ సమర్పణలో పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో జై కృష్ణ చెప్పిన సంగతులు... 

నా 16 ఏళ్ల వయసులో యాక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నాను. 
ఆ తర్వాత శిక్షణ తీసుకోవడం ప్రారంభించాను. రెండేళ్లు ముంబై, తర్వాత పాండిచ్చేరి, నెక్ట్స్‌ న్యూయార్క్‌ వెళ్లి యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత ఇండియా వచ్చి కథలు వినడం ప్రారంభించాను. కొన్ని కథలు విన్న తర్వాత, నిర్మాత పి. కిరణ్‌గారి ద్వారా దర్శకుడు అజయ్‌ భూపతిగారిని కలిశాను. అజయ్‌గారు చెప్పి కథ నచ్చడంతో, ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా చేశాను. మంచి క్యారెక్టరైజేషన్, మంచి ఎమోషన్‌తో కూడిన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాను. నేను అనుకున్న అంశాలు ఈ కథలో కుదిరాయి. ఈ చిత్రం కోసం అజయ్‌గారు 3 నెలలు వర్క్‌షాప్‌ చేయించారు. లుక్‌ టెస్ట్, స్క్రీన్‌ టెస్ట్, డైలాగ్స్‌... ఇవన్నీ ముందుగానే ప్రిపేర్‌ అయ్యాం. 

ఇందులో నేను శ్రీను అనే రోల్‌ చేశాను. శ్రీనుకి కాస్త అల్లరితనం ఉంటుంది. కానీ తనకేం కావాలో తనకి స్పష్టంగా తెలుసు. తను మంగను (రాషా తడానీ) ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఎలా సాగుతుంది? అన్నదే మిగిలిన సినిమా కథాంశం. ఇది రెగ్యులర్‌ లవ్‌స్టోరీ సినిమా కాదు. ఈ చిత్రంలో బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. ట్విస్ట్‌లు కొత్తగా ఉంటాయి. అజయ్‌గారు క్లారిటీ ఉన్న దర్శకుడు. అశ్వినీదత్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్‌లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో లాంచ్‌ కావడం హ్యాపీగా ఉంది. బాబాయ్‌ (మహేశ్‌బాబు) తొలి సినిమా కూడా ఈ బ్యానర్‌లోనే రూపొందింది.

నాకు ఫ్యామిలీ స పోర్ట్‌ ఉంది. నా ప్రతి అడుగులో బంగారు తాతయ్య (కృష్ణ సోదరుడు–నిర్మాత ఆదిశేషగిరి రావు) ్ర పోత్సాహం ఉంది. నేను సినిమాల్లోకి రావాలని, మంచి నటుడిగా ఎదగాలని మా తాతయ్య (కృష్ణ)గారు కోరుకున్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు సినిమాల గురించి చర్చించుకునేవాళ్లం. నేను యాక్టర్‌ కావాలనుకున్న తర్వాత బాబాయ్‌ సలహాలు, సూచనలు ఇచ్చారు. దర్శకుడు విజన్‌కు తగ్గట్లు యాక్ట్‌ చేయాలని చె΄్పారు. అలాగే ‘శ్రీనివాస మంగాపురం’ చూసి, హ్యాపీ ఫీలయ్యారు. ఈ సినిమా ఆయనకు నచ్చింది. యాక్షన్‌ సీక్వెన్స్‌లు, సాంగ్స్‌ చాలా నచ్చాయని చె΄్పారు. స్క్రీన్‌పై డిఫరెంట్‌గా కనిపిస్తున్నావని, క్యారెక్టర్‌లోకి పూర్తిగా వెళ్లి పోయావని చె΄్పారు.  

నా చిన్నతనంలో నేను సినిమా వాతావరణానికి దూరంగా ఉండి చదువుకునేవాడిని. మొదటిసారి ‘నిజం’ సినిమా షూటింగ్‌కు వెళ్లాను. ఇందులో చైల్డ్‌ క్యారెక్టర్‌ చేశాను. ఆ తర్వాత ‘అర్జున్‌’ షూటింగ్‌కు వెళ్లాను. ఈ చిత్రానికి మా నాన్నగారు నిర్మాత. ‘గుంటూరు కారం’ షూటింగ్‌కు వెళ్లాను. ఒక యాక్టర్‌గా నాకు విభిన్న జానర్స్‌లో సినిమాలు చేయాలని ఉంది. కానీ యాక్షన్‌ సినిమాలు చేయడం ఎక్కువ ఇష్టం. నేను యాక్టర్‌ని కావాలనుకున్నప్పుడే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement