లెనిన్ హిట్‌ ఎఫెక్ట్‌.. 30 లక్షల నుంచి 2 కోట్ల దాకా | Lenin Movie Hit Effect: Bhagyashree remuneration hike | Sakshi
Sakshi News home page

లెనిన్ హిట్‌ ఎఫెక్ట్‌.. 30 లక్షల నుంచి 2 కోట్ల దాకా

Jul 25 2026 11:29 PM | Updated on Jul 25 2026 11:42 PM

Lenin Movie Hit Effect: Bhagyashree remuneration hike

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన భాగ్యశ్రీ, మొదటి సినిమా ఫ్లాప్ అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా భాగ్యశ్రీ, అఖిల్‌తో కలిసి నటించిన లెనిన్ సినిమా ఆమె కెరీర్‌కు మలుపు తిప్పింది.  

మొదటి సినిమాలో ఆమెకు ఇచ్చిన పారితోషికం కేవలం రూ.30 లక్షలు మాత్రమే. కానీ లెనిన్‌ చిత్రానికి ఆమె రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగి కోటిన్నర రూపాయలకు చేరింది. ఇక త్వరలో సెట్స్‌పైకి రాబోతున్న మరో ప్రాజెక్ట్‌కి ఆమెకు రూ.2 కోట్ల పారితోషికం ఖరారైనట్టు సమాచారం.  

ఈ మధ్య లెనిన​ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా భాగ్యశ్రీ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చింది. భాగ్యశ్రీ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తనకు డబ్బు విలువ బాగా తెలుసని, చిన్నప్పుడు తన తండ్రి ఉద్యోగం కోసం ఎంతగా ప్రయత్నించాడో ఇప్పటికీ గుర్తుందని తెలిపింది.  

అందం, నటన రెండూ కలిసిన భాగ్యశ్రీ, కాంత, లెనిన్ వంటి సినిమాల్లో నటించి తన టాలెంట్‌ను నిరూపించుకుంది. గ్లామర్ రోల్స్‌కి కూడా ఎలాంటి కండిషన్లు పెట్టకుండా నటించడం ఆమె ప్రత్యేకత. ఇక మరో హిట్ పడితే, ఆమె పారితోషికం మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement