'ఆలోచన' టీజర్ రిలీజ్ చేసిన విజయేంద్ర ప్రసాద్ | Alochana Movie Teaser Launched Writer V Vijayendra Prasad | Sakshi
Sakshi News home page

'ఆలోచన' టీజర్ రిలీజ్ చేసిన విజయేంద్ర ప్రసాద్

Jul 25 2026 9:16 PM | Updated on Jul 25 2026 9:16 PM

Alochana Movie Teaser Launched Writer V Vijayendra Prasad

ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం 'ఆలోచన'. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఇ‍ప్పుడు టీజర్‌ని ప్రముఖ రచయిత విజయేoద్ర ప్రసాద్ విడుదల చేశారు.

'ఆలోచన' టీజర్ బాగుంది. వాస్తవ సంఘటనలని తీసుకొని చేసిన ఈ సినిమాని  అద్భుతమైన నటుల కాంబినేషన్‌తో స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్‌తో చేశారు. ఈ సినిమా విజయం సాధించి, చిత్ర యూనిట్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని విజయేంద్రప్రసాద్ అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement