45 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్ | Actress Padma Priya Reveals Her Motherhood And Baby | Sakshi
Sakshi News home page

Padma Priya: ఏడాది తర్వాత గుడ్ న్యూస్ రివీల్.. భర్త ఆప్ పార్టీ నేత

Jul 25 2026 6:06 PM | Updated on Jul 25 2026 6:23 PM

Actress Padma Priya Reveals Her Motherhood And Baby

తెలుగు సినిమా 'శ్రీను వాసంతి లక్ష‍్మి'తో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన పద్మప్రియ.. ఆపై తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించింది. పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈమె.. ఇన్నాళ్లకు తల్లయిన విషయాన్ని అది కూడా బిడ్డ పుట్టిన ఏడాది తర్వాత బయటపెట్టింది. రెండు ఫొటోలు షేర్ చేసింది. కాకపోతే బాబు లేదా పాప అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

స్వతహాగా మలయాళీ అయిన పద్మప్రియ.. టాలీవుడ్ మూవీతోనే కెరీర్ ప్రారంభించింది. ఆపై తెలుగులో అందరి బంధువయ, పటేల్ సర్ సినిమాలు చేసింది గానీ పెద్దగా పేరైతే రాలేదు. కానీ సొంత భాష మలయాళంలో మాత్రం వరసగా చిత్రాలు చేసింది. మృగం లాంటి డబ్బింగ్ మూవీలోనూ ఈమె నటించింది. చివరగా 2022లో రిలీజైన 'వండర్ ఉమెన్' సినిమాలో కనిపించింది.

వ్యక్తిగత విషయానికొస్తే.. ఆప్ పార్టీకి చెందిన జాస్మిన్ షా అనే వ్యక్తిని 2014లో పద్మప్రియ పెళ్లి చేసుకుంది. భర్త రాజకీయంగా బిజీగా ఉండగా.. ఈమె మాత్రం వివాహం తర్వాత కూడా అడపాదడపా మూవీస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తనకు ఓ బిడ్డ పుట్టిందనే సంగతి వెల్లడించింది. అంటే 45 ఏళ్ల వయసులో పద్మప్రియ తల్లయింది.

ఏడాదిగా సోషల్ మీడియాలో పద్మప్రియ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ ఇప్పటివరకు తన ప్రెగ్నెన్సీ గురించి గానీ, బిడ్డ పుట్టిన విషయాన్ని గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. సడన్‌గా పోస్ట్‌ పెట్టేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే తోటి నటీనటులు పద్మప్రియకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: నా కొడుకుతో 'సిసింద్రీ 2' సినిమా చేస్తా: అఖిల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement