అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. మూవీ హడావుడి అంతా ముగిసిపోవడంతో ఇప్పుడో ఓ యూట్యూబర్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన బోలెడు విషయాల్ని పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా నెలల వయసున్నప్పుడు తనతో తీసిన 'సిసింద్రీ' గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని సంగతులు షేర్ చేశాడు.
(ఇదీ చదవండి: షాకింగ్.. అఖిల్ అక్కినేని ఇండియన్ కాదా?)
'నాకే గనక కొడుకు పుడితే సిసింద్రీ-2 చేస్తాను. ఈ విషయాన్ని నా భార్య జైనాబ్‌కి కూడా చెప్పాను. నాకు కొడుకు పుడతాడా? కూతురు పుడతుందా? అనేది దేవుడి చేతుల్లో ఉంది. ఒకవేళ కొడుకు పుడితే మాత్రం తనని పెట్టి సిసింద్రీ 2' తీయాలనేది నా ఆలోచన. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో నేను నాలుగు గంటల మాత్రమే మెలకువగా ఉండేవాడిని. ఆ టైంలో నా మూడ్ బాగుంటేనే షూటింగ్ చేసేవారు. సినిమాలో నేను నవ్వాల్సిన సందర్భంలో కెమెరా వెనక నాన్న నిలబడి సైగలు చేసేవారు. వాటిని చూసి నేను నవ్వేవాడిని. ఏడవాల్సిన సీన్స్ కోసం అమ్మ కారు ఎక్కి వెళ్లిపోయేది. అది చూసి నేను ఏడిస్తే ఆ సీన్స్ షూటింగ్ చేసేవారు' అని అఖిల్ పాత విషయాల్ని చెప్పుకొచ్చాడు.
'సిసింద్రీ' సినిమాని హాలీవుడ్ సినిమా.. 'బేబీస్ డే ఔట్' ఆధారంగా తెరకెక్కించారు. శివనాగేశ్వరరావు దర్శకుడు కాగా నాగార్జున నిర్మించడంతోపాటు ఇందులో కీలక పాత్ర చేశాడు. ఈ మూవీ కమర్షియల్‌గా హిట్ అయింది. అఖిల్‌కి ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రంతో వచ్చిన లాభాలతోనే అమల.. తనకు ఎంతో ఇష్టమైన జంతు సంరక్షణ సంస్థ 'బ్లూ క్రాస్'ను ప్రారంభించారని అఖిల్ చెప్పాడు.
'సిసింద్రీ' విషయానికొస్తే.. ఓ డబ్బింటి కుటుంబానికి చెందిన చిన్న పిల్లాడిని.. డబ్బుల కోసం తన బాబాయి కిడ్నాప్ చేయిస్తాడు. అందులో భాగమైన ముగ్గురు దొంగల్ని ఆ చిన్నపిల్లాడు ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు? తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు ఎలా చేరుకున్నాడు అనేది స్టోరీ. పూర్తిగా ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఈ సినిమాలో ఎంతో ముద్దుగా కనిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిన అఖిల్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు.
(ఇదీ చదవండి: నన్ను చూసి నాకే అసహ్యమేసింది: అఖిల్)


