అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కాగా.. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించింది.
తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలోని వారెవా వారెవా అంటూ సాగే పాట ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ లవ్ సాంగ్‌కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ ఆలపించారు. ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేశారు.


