రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జన నాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీని థియేటర్లలో చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీని హీరోయిన్ త్రిష కూడా వీక్షించారు. చెన్నైలోని రోహిణి థియేటర్‌కు వెళ్లిన ఆమె జన నాయగన్ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతేకాకుండా ఈ మూవీని త్రిష మదర్ కూడా జన నాయగన్ చూశారు. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
విజయ్ జన నాయగన్ సినిమా చూసి మేము చాలా ఆనందించామని నటి త్రిష తల్లి ఉమా కృష్ణన్ అన్నారు. ఈ మూవీని ఎంతో ఆస్వాదించామని తెలిపారు. ఇది ఆయన చివరి చిత్రం కావడం నాకు బాధగా ఉందన్నారు. మేము ఆయనను చాలా మిస్ అవుతామని ఉమా కృష్ణన్ నిరాశ వ్యక్తం చేశారు.


