breaking news
Jana Nayagan Movie
-
దళపతి చివరి సినిమాలో ముగ్గురు స్టార్ దర్శకులు?
తమిళ స్టార్ దళపతి విజయ్.. రీసెంట్‌గానే మధురైలో భారీ బహిరంగ సభ పెడితే ఏకంగా లక్షలాది మంది అభిమానులు వచ్చారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్న విజయ్.. మరోవైపు తన చివరి చిత్రాన్ని పూర్తి చేసే పనిలోనూ ఉన్నాడు. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే నటి పెళ్లి.. ఏడాది తిరిగేలోపు కూతురు)విజయ్ 'జన నాయగన్'... తెలుగు చిత్రం 'భగవంత్ కేసరి' రీమేక్ అని ప్రచారం అయితే ఉంది కానీ నిజమేంటి అనేది మూవీ రిలీజైతే తప్ప తెలియదు. అయితే ఇది విజయ్ చివరి చిత్రమని ప్రచారం నడుస్తోంది కాబట్టి ఇందులో పలు సర్ప్రైజులు ఉండబోతున్నాయట. తమిళ స్టార్ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్, లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారట. సోషల్ మీడియాలో ఈ రూమర్ గట్టిగానే వినిపిస్తుంది.ఈ ముగ్గురు దర్శకులు కూడా విజయ్‌తో సినిమాలు తీశారు. అట్లీ, లోకేశ్ తలో రెండేసి చిత్రాలు చేయగా.. నెల్సన్ ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. అలా విజయ్‌పై అభిమానం దృష్ట్యా.. ఇతడి చివరి చిత్రమైన 'జన నాయగన్'లో జర్నలిస్టులుగా చిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇకపోతే ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. 'ప్రేమలు' మమిత బైజు కీలక పాత్ర చేస్తోంది. హెచ్. వినోద్ దర్శకుడు కాగా అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే?
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ (Jana Nayagan Movie). ఇదే ఆయన చివరి చిత్రమని, దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జన నాయగన్.. విజయ్ ఆఖరి సినిమానా? అని అందరి మనసులో ఉన్న ప్రశ్నని హీరోయిన్ మమితా బైజు నేరుగా దళపతినే అడిగేసింది. భావోద్వేగం..అందుకాయన 2026లో జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారంది. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచినా.. చిత్రీకరణ చివరి రోజు మాత్రం విజయ్ సహా అందరూ భావోద్వేగానికి లోనయ్యారట! అందుకనే విజయ్ టీమ్‌తో కలిసి సరిగా ఫోటోలు కూడా దిగలేకపోయారని చెప్తోంది మమితా (Mamitha Baiju). జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.చదవండి: మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా అతడి చివరి సినిమా నుంచి సర్ప్రైజ్ వచ్చింది. అర్థరాత్రి 12 గంటలకు ఫస్ట్ రోర్ పేరిట 'జన నాయగణ్' నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ పోలీస్‌గా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియోకు ఇతడి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎప్పటిలానే అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు!)బయటకు చెప్పలేదు గానీ 'జన నాయగణ్' సినిమా 'భగవంత్ కేసరి' అనే తెలుగు సినిమాకు రీమేక్. గతంలో పలు అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు పోలీస్ గెటప్‌లో ఉన్న వీడియో రిలీజ్ చేయడంతో కొంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇక ట్రైలర్, మిగతా కంటెంట్ వస్తే గనుక రీమేక్ కాదా అనేది కన్ఫర్మ్ అయిపోతుంది.హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె షూటింగ్ రీసెంట్‌గానే పూర్తయింది. మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే రాజకీయాల్లకి అడుగుపెట్టిన విజయ్‌కి ఇదే చివరి చిత్రం కావడంతో అటు అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు)