చెన్నై ఎయిర్‌పోర్ట్ కిటకటిలాడుతుంది. మలేషియాకు వెళ్లే విమానాలు ఫుల్ అయిపోయాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? విజయ్ 'జన నాయగన్' కోసం. తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ఈ మూవీ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్ స్టేడియం (Bukit Jalil Stadium)లో డిసెంబరు 27న జన నాయగన్ మూవీ వేడుక నిర్వహించనున్నారు. దీంతో తమిళనాడు నుంచి ఆయన ఫ్యాన్స్ భారీగా మలేషియాకు ప్రయాణం అయ్యారు. దీంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ కోసం భారీగా క్యూ కట్టేశారు.

మలేషియాలో తమిళ సినిమాలకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా విజయ్‌కు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆడియో వేడుకను అక్కడ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకర్షించవచ్చని మేకర్స్ ప్లాన్ చేశారు. బుకిట్ జలీల్ స్టేడియం దక్షిణాసియాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటి. ఇందులో 90వేల మందికి పైగా సీటింగ్ సామర్థ్యం ఉంది.
ఈ కార్యక్రమంలో విజయ్‌తో పాటు చిత్ర యూనిట్, సంగీత దర్శకుడు అనిరుధ్ పాల్గొననున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. ఈ వేడుకను పూర్తిగా సినిమా, సంగీతానికే పరిమితం చేయాలని మలేషియా పోలీసులు ఇప్పటికే స్పష్టమైన నియమాలు పెట్టారు. రాజకీయ ప్రసంగాలు, చిహ్నాలు అక్కడ కనిపించకూడదని నిషేధించారు.
Crowd at Chennai Airport Immigration 🤯 — Only for #JanaNayagan Audio Launch 🔥 pic.twitter.com/dtW5hlsvgO
— VCD (@VCDtweets) December 26, 2025


