చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారంలో థియేటర్లలో చిన్న సినిమాలు రిలీజైనా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ వారంలో విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతోంది. దీంతో పాటు అమరావతికి ఆహ్వానం, నీలవే, కపుల్ ఫ్రెండ్లీ లాంచి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఇక ఓటీటీల విషయానికొస్తే సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ సందడి చేస్తున్నాయి. ఈ ఫ్రైడే మరిన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. తెలుగు సినిమాలు లేకపోయినా పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే దాదాపు 13 చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలు
నెట్‌ఫ్లిక్స్
- జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13
- మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ సిరీస్) - ఫిబ్రవరి 13
- ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 13
అమెజాన్ ప్రైమ్..
- బ్యాండ్‌వాలే( హిందీ వెబ్ సిరీస్)-ఫిబ్రవరి 13
- లవ్ మీ లవ్ మీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 13
జియో హాట్‌స్టార్..
- ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 13
జీ5
- భానుప్రియ భూతర్ హోటల్(బెంగాలీ హారర్ మూవీ)- ఫిబ్రవరి 13
- పాతిరాత్రి(మలయాళ సినిమా)- ఫిబ్రవరి 13
ఉత్తర్(మరాఠీ సినిమా)- ఫిబ్రవరి 13
సన్ నెక్స్ట్
- సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ చిత్రం) - ఫిబ్రవరి 13
- మాయబిమ్‌బుమ్(తమిళ సినిమా)-ఫిబ్రవరి 13
ఆపిల్ టీవీ ప్లస్
- ఎటర్నటీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13
ది లయన్స్ గేట్ ప్లే..
- ది రఫ్‌నెక్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13


