యశ్ టాక్సిక్‌.. రిలీజ్‌కు ముందే మరో వివాదం..! | Toxic faces backlash from Christian group over religious imagery in teaser | Sakshi
Sakshi News home page

Toxic Movie: వివాదంలో యశ్ టాక్సిక్‌.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్..!

Feb 12 2026 5:08 PM | Updated on Feb 12 2026 5:14 PM

Toxic faces backlash from Christian group over religious imagery in teaser

కేజీఎఫ్ హీరో నటించిన ఫుల్ యాక్షన్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. టీజర్ రిలీజ్ తర్వాత బోల్డ్ సీన్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఆ సీన్‌ విషయంలో కొందపు ఏకంగా డైరెక్టర్‌ గీతూ మోహన్‌ దాస్‌పై మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. 

తాజాగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌కు ముందే మరో కొత్త వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా చిత్రీకరించారని ఓ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు తమ మత విశ్వాసాలను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ సంబంధిత అధికారులకు లేఖ రాసింది. తమ మతంలో ప్రధాన దేవదూత అయిన సెయింట్ మైఖేల్ చిత్రీకరణపై ఈ బృందం ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సెయింట్‌ను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించారని.. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందని నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్  ఆరోపిస్తోంది.

అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాడని ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ అధికారులను కోరారు. వివాదాస్పద దృశ్యాలను, ఆన్‌లైన్ వీడియోలను కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అదనంగా చిత్రనిర్మాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై మూవీ మేకర్స్ స్పందించాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకు చిత్రనిర్మాతలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా.. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ధురంధర-2తో పోటీ పడనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement