రాజ్‌కుమార్‌ హిరాణి హిట్‌ సినిమా సీక్వెల్‌ రెడీ | Film Director Rajkumar Hirani Confirmed 3 Idiots Sequel, Says Interesting Story Development Underway | Sakshi
Sakshi News home page

రాజ్‌కుమార్‌ హిరాణి హిట్‌ సినిమా సీక్వెల్‌ రెడీ

Feb 12 2026 10:22 AM | Updated on Feb 12 2026 10:47 AM

Film Director Rajkumar Hirani confirmed 3 Idiots Sequel

బాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణి 3 ఇడియట్స్‌’ మూవీ సీక్వెల్‌ ప్రకటించాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయి అని తెలిపాడు. విధు వినోద్‌ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో ఆమిర్‌ఖాన్  హీరోగా, ఆర్‌. మాధవన్ , శర్మన్  జోషి, కరీనా కపూర్, బొమన్  ఇరానీ ప్రధానపాత్రల్లో నటించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో 3 ఇడియట్స్‌ సీక్వెల్‌ గురించి రాజ్‌కుమార్‌ హిరాణి ఇలా అన్నారు. 3 ఇడియట్స్‌ సీక్వెల్‌ కథ కోసం పనులు ప్రారంభించామన్నారు. స్టోరీ విషయంలో సరికొత్త ఆలోచన వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ప్రేక్షకులు ఎలా రిసీవ​్‌ చేసుకుంటారో అనే ఆలోచన కూడా ఉంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ పనులు మొదలుపెట్టలేదంటూనే దాదాపు అంతా సిద్ధమైందన్నారు.  ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో  ‘3 ఇడియట్స్‌’ సీక్వెల​్‌ కథనం సాగుతుందని బాలీవుడ్‌ భోగట్టా. మరోవైపు మున్నాభాయ్‌ సీక్వెల్‌ కూడా కథ పూర్తి అయినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement