త్రీడీలో చూసి షాక్‌ అయ్యాను | NikhilSiddhartha Swayambhu Launch | Sakshi
Sakshi News home page

త్రీడీలో చూసి షాక్‌ అయ్యాను

Feb 12 2026 4:12 AM | Updated on Feb 12 2026 4:12 AM

NikhilSiddhartha Swayambhu Launch

– నిఖిల్‌  

‘‘కార్తికేయ 2’ వంటి పాన్‌ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్‌ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని నిఖిల్‌ చె΄్పారు. నిఖిల్‌ హీరోగా, సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘స్వయంభు’.  భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మించారు. 

ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్‌ భాషల్లో త్వరలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిఖిల్‌ మాట్లాడుతూ– ‘‘వెయ్యేళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవారు. అల్లరిగా తిరిగే అండర్‌ డాగ్‌ రాజ్యాలను శాసించే స్థాయికి ఆయన ఎలా ఎదిగారు? అనేది మా సినిమాలో చూపించాం. ఈ మూవీని త్రీడీలో చూసినప్పుడు షాక్‌ అయ్యాను. ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్‌ చేస్తారు’’ అని చె΄్పారు. భరత్‌ కృష్ణమాచారి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా అందరికీ గొప్ప అనుభూతినిస్తుంది’’ అని పేర్కొన్నారు. 
‘‘ఈ సినిమాలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు కెమెరామేన్‌ సెంథిల్‌ కుమార్‌.   

Advertisement
 
Advertisement
Advertisement