నిఖిల్ హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ మూవీ ‘స్వయంభు’. ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్‌కి ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు శనివారం నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రంలో చేసిన పాత్ర కోసం నిఖిల్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. విజువల్ వండర్‌లా ఈ సినిమా ఉంటుంది. వీఎఫ్‌ఎక్స్ అద్భుతంగా ఉంటాయి. సెంథిల్ కెమెరా పనితనం, రవి బస్రూర్ సంగీతం హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు నిర్మాతలు.


