ప్రముఖ కోలీవుడ్ గేయ రచయిత వైరముత్తుకు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు అభినందనలు చెప్పడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో విమర్శలు చేస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ ట్వీట్ చేయడంపై చిన్మయి మండిపడింది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తుకు అభినందనలు చెప్పడంపై చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంవో ఆఫీస్ నుంచి వైరముత్తుకు అభినందనలు రావడంపై కూడా చిన్మయి స్పందించింది. అసలు పవన్ కల్యాణ్ గారికి ఆ కవి గురించి ఏమీ తెలియదని నాకు కచ్చితంగా తెలుసు.. ఎంతోమంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆయనకు డిప్యూటీ సీఎంవో కార్యాలయం నుంచి అభినందనలు తెలపడం విచిత్రంగా ఉందని ట్వీట్ చేసింది. అసలు ఒక సినిమా పాటల రచయితకు ఇంతమంది రాజకీయ నాయకులు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదంటూ చిన్మయి తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
కాగా.. మీటూ ఉద్యమ సమయంలో ప్రముఖ లిరిసిస్ట్ అయిన వైరముత్తుపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. చిన్మయితో పాటు పలువురు మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ చిన్మయి తన వాదన వినిపిస్తూనే ఉంది.
With due respect - I am pretty sure Pawan Kalyan Garu has no idea about the poet - His office needs to tell him he is wishing "Complete health and happiness" to a molester named by several women.
What is the need for so many politicians to wish a film song lyricist, I don't… https://t.co/RuABQDEJ1Z— Chinmayi Sripaada (@Chinmayi) March 15, 2026


