‘ఆస్కార్ 2026’ లైవ్‌..భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు? | Oscars 2026: When And Where To Watch Live In India, Live stream Details | Sakshi
Sakshi News home page

Oscars 2026 Live Streaming: భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

Mar 15 2026 3:21 PM | Updated on Mar 15 2026 4:09 PM

Oscars 2026: When And Where To Watch Live In India, Live stream Details

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్‌ (Oscar Awards 2026) అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్‌ ఈ వేడుకకు వేదికైంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ రోజు(మార్చి 15) సాయంత్రం ఈ వేడుక జరుగుతుంది.టైమ్ జోన్ వ్యత్యాసం కారణంగా, ఇండియాలో మనం మార్చి 16 (సోమవారం) ఉదయం చూడాల్సి ఉంటుంది. రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌ సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రధాన అవార్డుల వేడుక ఉదయం 4:30 గంటలకు మొదలవుతుంది.

లైవ్‌ ఎక్కడ చూడొచ్చు?
టీవీలో లేదా మొబైల్‌లో ఆస్కార్ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఓటీటీ విషయానికొస్తే.. జియోస్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టెలివిజన్‌ ప్రసారం విషయానికి వస్తే... ఈ అవార్డుల వేడుకను స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, కలర్స్ ఇన్ఫినిటీ ఛానళ్లలో ప్రసారం చేయనున్నారు. ఒకవేళ మీరు ఉదయాన్నే లైవ్ మిస్ అయితే, అదే రోజు (సోమవారం) రాత్రి 9 గంటలకు కు ఈ ఛానెల్‌లలో మళ్లీ ప్రసారం చేస్తారు.

హోస్ట్‌ ఎవరు?
ప్రముఖ కమెడియన్ కోనన్ ఓ'బ్రియన్ (Conan O'Brien) ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియా నుంచి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ ఏడాది అవార్డు ప్రజెంటర్లలో ఒకరుగా పాల్గొంటున్నారు.

ఇండియాకు నిరాశే..
98వ ఆస్కార్‌ అవార్డ్సులో భారత్‌కు నిరాశే ఎదురైంది. మనదేశం నుంచి ఒక్క చిత్రం కూడా అవార్డు రేసులో నిలవలేదు. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్‌బౌండ్‌’ను పంపింది. కానీ నామినేషన్‌ దక్కించుకోలేకపోయింది. ఇక ఈ సారి ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్‌ డికాప్రియో, ఈథన్‌ హాక్, మైఖేల్‌ బి జోర్డాన్, వాగ్నర్‌ మౌరా పోటీ పడుతున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్‌ దక్కించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement