అసలు ఈ సుయోధన ఎవడు?.. ఆసక్తిగా టీజర్ | PriyaDarshi Latest Movie Suyodhana Teaser out now | Sakshi
Sakshi News home page

Suyodhana Teaser: అసలు ఈ సుయోధన ఎవడు?.. ఆసక్తిగా టీజర్

Mar 15 2026 3:50 PM | Updated on Mar 15 2026 4:51 PM

PriyaDarshi  Latest Movie Suyodhana Teaser out now

ప్రియదర్శి, ద్రిషిక చందర్‌ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం సుయోధన. ఈ సినిమాకు వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అసలు ఈ స్టోరీ నీకు ఎక్కడ దొరికింది? అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. టీజర్ చూస్తుంటే దుర్యోధనుడిలా కనిపించే ఓ వ్యక్తి వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement