భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. వైభ‌వ్ సూర్య‌వంశీకి ఛాన్స్‌ | Vaibhav Sooryavanshi picked in India 'A' squad for one-day tri-series in Sri Lanka | Sakshi
Sakshi News home page

IND vs SL: భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. వైభ‌వ్ సూర్య‌వంశీకి ఛాన్స్‌

May 14 2026 5:09 PM | Updated on May 14 2026 6:35 PM

Vaibhav Sooryavanshi picked in India 'A' squad for one-day tri-series in Sri Lanka

ఈ ఏడాది జూన్‌లో శ్రీలంకలో జ‌ర‌గ‌నున్న వ‌న్డే ట్రై-సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన భారత 'ఎ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా అస్సాం ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

ఇక ఈ జ‌ట్టులో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌లనం వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు ద‌క్కింది. వైభ‌వ్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2026లో ఈ చిచ్చ‌ర పిడుగు  దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లలో 236.56 స్ట్రైక్-రేట్‌తో 440 పరుగులు సాధించాడు.

ఇందులో ఏకంగా 40 సిక్సర్లే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జ‌రిగిన అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా వైభ‌వ్ అద‌ర‌గొట్టాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో 175 ప‌రుగులు సాధించి భార‌త్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి ఇండియా-ఎ జ‌ట్టులో చోటు ల‌భించింది. 

అదేవిధంగా ఐపీఎల్‌లో రాణిస్తున్న ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అన్షుల్ కంబోజ్, సూర్యాంశ్ షెడ్గే వంటి ఆటగాళ్లు కూడా ఈ జ‌ట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ 'ఎ' జట్లతో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఈ ట్రై-సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది.

ఈ టోర్నీ డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరగనుంది. , జూన్ 21న జరిగే ఫైనల్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత ఇండియా 'ఎ' జట్టు శ్రీలంక 'ఎ'తో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు కూడా ఆడనుంది. వైట్-బాల్ సిరీస్ దంబుల్లాలో, రెడ్-బాల్ మ్యాచ్‌లు గాలే వేదికగా జరగనున్నాయి.

భారత-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్‌), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్‌), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్‌), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్
చదవండి: హార్దిక్‌ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement