రూ. 44 వేలు తగలేసినా.. క్షోభ పెట్టారు : ఇండిగోపై తీవ్ర ఆరోపణలు | paid Rs 44k for tickets Man claims IndiGo seated 3 year-old away from parents | Sakshi
Sakshi News home page

రూ. 44 వేలు తగలేసినా.. క్షోభ పెట్టారు : ఇండిగోపై తీవ్ర ఆరోపణలు

May 14 2026 7:26 PM | Updated on May 14 2026 8:08 PM

paid Rs 44k for tickets Man claims IndiGo seated 3 year-old away from parents

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై నాగ్‌పూర్‌కు చెందిన ఒక న్యాయవాది ఆరోపణలు సంచలనంగా మారాయి.  బాగ్డోగ్రా నుండి కోల్‌కతా వెళ్తున్న విమానంలో తన 3 ఏళ్ల చిన్నారిని తల్లిదండ్రుల నుంచి దూరంగా కూర్చోబెట్టారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలు విమానయాన సంస్థల సీట్ల కేటాయింపు పద్ధతులు, కుటుంబ సీటింగ్ విధానాలపై ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీశాయి.

టిక్కెట్ల కోసం రూ. 44 వేలు చెల్లించినా, ఇండిగో తన మూడేళ్ల బిడ్డను తల్లిదండ్రులకు దూరంగా కూర్చోబెట్టిందని, ఇది తమకు తీవ్రమైన మానసిక వేదన కలిగించిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు. గౌరవ్ మిశ్రా సుమారు రూ. 43,900 ఖర్చు చేసి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, విమానంలో సీట్ల కేటాయింపు సమయంలో ఇండిగో సిబ్బంది ఆ 3 ఏళ్ల బాబుకు, తల్లిదండ్రులకు వేర్వేరు చోట్ల సీట్లు కేటాయించారు. ఇదే ఆందోళనకు దారి తీసింది.

ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లి

గౌరవ్ మిశ్రా ఆరోపణలు ఏంటి? 
సీట్ సెలక్షన్ కోసం తాము అదనపు డబ్బులు చెల్లించలేదనే కారణంతోనే, విమానయాన సంస్థ కావాలనే అందరినీ విడివిడిగా కూర్చోబెట్టారని లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా  ఆయన డీజీసీఏ (DGCA) నిబంధనలను ప్రస్తావించారు.  12 ఏళ్లలోపు పిల్లలకు కనీసం ఒక తల్లి లేదా తండ్రి పక్కన సీటు కేటాయించాలని డీజీసీఏ నిబంధనలు (Rule 3.15) చెబుతున్నాయని, ఇండిగో దీన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. 
ప్రయాణ సమయంలో విమానం బాగా కుదుపులకు (Turbulence) లోనైందని, ఆ సమయంలో తన పక్కన ఎవరూ లేకపోవడంతో చిన్నారి తీవ్ర భయాందోళనకు గురయ్యాడని మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు.  ఇది తమకు  'తీవ్రమైన మానసిక వేదన'గా  కలిగించిందన్నారు.

ఇదీ చదవండి : రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్‌ ‘ది స్కిన్‌ డాక్టర్‌’ కి షాక్‌
 

నెటిజన్ల స్పందన 
ఈ ఉదంతంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. లాభాల కోసం ఇంత కనికరం లేకుండా ప్రవర్తిస్తారా? 3 ఏళ్ల పిల్లాడిని ఒంటరిగా కూర్చో బెట్టడం భద్రతా పరంగా కూడా రిస్క్  కొందరు ఇండిగోపై మండిపడ్డారు.  ఫ్యామిలీ మెంబర్లను విడదీసి, సీట్ల కోసం డబ్బులు అడగడం ఇప్పుడు అన్ని విమాన సంస్థలకు ఒక అలవాటుగా మారింది" అని మరికొందరు విమర్శించారు. విమాన సంస్థలు వ్యాపార దృక్పథంతో నిబంధనలను పక్కన పెట్టడం సరికాదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రూ. 44 వేలు పెట్టినప్పుడు, సీట్ల కోసం మరో కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టలేరా?" అని కొందరంటే,  ఒకవేళ సీట్లు వేరుగా వచ్చినా,  ఎవర్నో ఒకర్ని అడిగి సీటు మార్చుకోవచ్చు కదా?" అని మరికొందరు సలహా ఇచ్చారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్పందన
తరువాత ఇండిగో ఈ ఫిర్యాదుపై బహిరంగంగా స్పందిస్తూ, మిశ్రాను నేరుగా సంప్రదించడానికి ప్రయత్నించినా, కానీ కుదరలేదు. తదుపరి సంప్రదింపుల కోసం దయచేసి మీకు అనువైన సమయాన్ని లేదా ప్రత్యామ్నాయ సంప్రదింపు నంబర్‌ను డీఎంల ద్వారా తెలియజేయాలని కోరింది.
 

Advertisement
 
Advertisement
Advertisement