Suyodhana Movie
-
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి బలగం, కోర్ట్ తదితర సినిమాలతో లీడ్ రోల్స్ చేస్తూ హిట్స్ కొడుతున్న ప్రియదర్శి లేటెస్ట్గా చేసిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలాంటి ప్రచారం లేకుండానే థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతూ ఓటీటీల్లోకి కూడా సైలెంట్ గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)ప్రియదర్శి, సాయికుమార్, ద్రిషిక చందర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'సుయోధన'. వైఎస్ మాధవరెడ్డి దర్శకుడు. గత నెల 27వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కనీసం ప్రచారం చేయకుండానే రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మూడు వారాల్లోనే ఎలాంటి ప్రచారం లేకుండా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది.'సుయోధన' విషయానికొస్తే.. వరుణ్ (ప్రియదర్శి) ఓ ఫోలే ఆర్టిస్ట్. అంటే సినిమాల్లో వినిపించే రకరకాల సౌండ్స్ సృష్టిస్తుంటాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి సుయోధన అనే వింత శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ టైంలో ధుర్యోధనుడి రూపం ఇతడికి కనిపిస్తుంది. అలా జరిగినప్పుడల్లా వరుణ్ చాలా భయపడుతుంటాడు. మరోవైపు వరుణ్ తండ్రి ప్రకాశ్(సాయికుమార్) నాటకాల వేస్తుంటాడు. ఈయనకు ధుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. అలా ఓ సారి ఈ పాత్ర వేసిన తర్వాత ఈయన హత్యకు గురవుతాడు. అసలు సుయోధన అనే శబ్దం వరుణ్‌కి వినిపించడానికి కారణమేంటి? ప్రకాశ్‌ని ఎవరు చంపారనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లర్ సినిమా) -
కొత్త నిర్మాతలకు ఇదే నా సలహా : ‘సుయోధన’ నిర్మాత
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడుమోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ - సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది. అన్నారు.డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ - సుయోధన మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్ చేస్తున్నారు. ప్రియదర్శి, సాయికుమార్ నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీరు రీచ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు. -
ప్రియదర్శి సస్పెన్స్ థ్రిల్లర్ సుయోధన.. ఆడియన్స్‌ను మెప్పించిందా?
టాలీవుడ్ హీరో ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా 'సుయోధన' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చారు. ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్గా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 27న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటించారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ మూవీతో ప్రియదర్శి మరో హిట్ కొట్టాడా? లేదా అన్నది రివ్యూలో చూద్దాం.ఈ మూవీ కథేంటంటే..వరుణ్ (ప్రియదర్శి) ఒక 'ఫోలే' (సౌండ్ డిజైనర్) ఆర్టిస్ట్. వరుణ్‌కి చిన్నప్పటి నుంచి 'సుయోధన' అనే ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో దుర్యోధనుడి ఆకారం కళ్ల ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. అది విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా భయపడుతుంటాడు. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) నాటకాలు వేస్తుంటారు. ఆయనకు దుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. ఇది చూసే వరుణ్ భయపడుతున్నాడని అతని తల్లి రాధమ్మ, డాక్టర్లు చెప్పడంతో.. ప్రకాష్ నాటకాలు ఆపేస్తారు. ఇక వరుణ్ ఫోలీ స్టూడియో పెట్టుకొని జీవితం సాగిస్తుంటాడు. అప్పుడే సమిత (ద్రిషిక చందర్) ఒక డెమో ఫిల్మ్ షూటింగ్ చేయడానికి రాగా.. వరుణ్‌కు పరిచయం అవుతుంది. సమిత షూట్ చేసిన ఓ పాత్ర అతనికి దుర్యోధనుడిలా కనిపిస్తుంది. తనకు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ప్రకాశే వరుణ్‌కు దుర్యోధనుడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత వరుణ్ తండ్రి హత్యకు గురవుతాడు. అసలు వరుణ్ తండ్రిని చంపింది ఎవరు? హత్యలో ఏదైనా రాజకీయ కోణం ఏంటి? సుయోధన అనే శబ్దం వరుణ్‌కే ఎందుకు వినిపిస్తోంది? అసలు ఈ సినిమాలో సుయోధన ఎవరు? అనేది తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..హీరో ప్రియదర్శికి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ పాత్ర కొత్తే అయినప్పటికీ.. గతంలో ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇక్కడ టాలీవుడ్ ప్రేక్షకులకు 'ఫోలే' ఆర్టిస్ట్ అనేది కొత్త యాంగిల్ నచ్చిందనే చెప్పాలి. సినిమాలో వచ్చే శబ్దాలను ఇలా రికార్డ్ చేస్తారా? అనే విషయం సుయోధన ద్వారా ప్రేక్షకులకు అర్థమైంది. స్క్రీన్ ప్లేతో పాటు సినిమాలోని కొన్ని ట్విస్టులు ఆడియన్స్‌ను మెప్పిస్తాయి.సినిమా ప్రారంభం నుంచే డైరక్టర్ సస్పెన్స్ క్రియేట్ చేయడంలోచాలా వరకు సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకుల్లో వాట్ నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఈ కథలో 'సౌండ్' కీ రోల్ ప్లే చేసింది. దర్శకుడు మాధవ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే అక్కడక్కడ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం కాస్తా ఎంగేజింగ్‌గా ఉంటుంది. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరింత ఆసక్తిగా ఉంటే బాగుండేది. దర్శకుడికి తొలి సినిమా అయినా తడబడకుండానే తెరకెక్కించాడు. ఈ కథ సైకలాజికల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ కూడా బాగానే వర్కవుట్ అయింది. ఓవరాల్‌గా ఆడియన్స్‌కు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సుయోధన. రొటీన్‌కు భిన్నంగా.. వినూత్నమైన మిస్టరీ థ్రిల్లర్‌ను చూడాలనుకుంటే 'సుయోధన' ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..ప్రియదర్శి మరోసారి తన పాత్రలో అదరగొట్టేశాడు. సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుర్యోధనుడి పాత్రతో మెప్పించారు. ఆయన డైలాగ్స్, నటనతో ఈ సినిమాకు ప్లస్. సీనియర్ హీరోయిన్ ప్రేమ తల్లి పాత్రలో ఆకట్టుకున్నారు. హీరోయిన్ ద్రిశికా చందర్ తన గ్లామర్‌తో అలరించింది. విష్ణు ఓయ్, దేవి ప్రసాద్ తమ పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సినిమాలో హీరో సత్యదేవ్, బిత్తిరి సత్తి కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. సాంకేతికపరంగా చూస్తే సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం పోశాయి. జై క్రిష్ అందించిన సంగీతం ఫర్వాలేదు. ముఖ్యంగా కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నతంగా బాగున్నాయి. -
సినిమా ఫ్లాప్ అయితే.. కోడి రామకృష్ణ మాటలు గుర్తు తెచ్చుకుంటా: ప్రియదర్శి
ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ ‘సుయోధన’ సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నుహైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ - ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు మరింత చేరువ కావాలి, వారి ఆదరణ మరింత పొందాలనే ప్రయత్నిస్తుంటాను. ఆ క్రమంలో ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే బాధగా ఉంటుంది. అలాంటప్పుడే కోడి రామకృష్ణ లాంటి లెజెండ్స్ నా గురించి బాగా చెప్పారు కదా అనే ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుంటాయి. సాయి కుమార్ , ఆయన కుటుంబం 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. పరిశ్రమ అభివృద్ధిలో భాగమవుతున్నారు. ఈ చిత్రంలో సుయోధన పాత్రకు ఆయన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అంత బాగా నటించారు. ప్రేక్షకుల ఊహకు అందనంత ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఈ కథ, టైటిల్ విన్నప్పుడే ఇది కొత్తగా ఉంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమానే నన్ను సెలెక్ట్ చేసుకుందని అనిపిస్తుంటుంది. ఈ చిత్రంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. హాలీవుడ్ క్లాసిక్ మూవీ డ్యూన్ లెవెల్లో ఈ సినిమా చేయాలని మా మూవీ టీమ్ పట్టుదలగా పనిచేశారు. మా సినిమాను మీరు థియేటర్స్ లో చూసి మంచి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా’అన్నారు.సాయికుమార్ మాట్లాడుతూ - నేను 1972లో ధుర్యోధనుడి పాత్రను నాటికలో అభినయించాను. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. ఇప్పుడు ఈ చిత్రంలో సుయోధనుడిగా నటిస్తుంటే ఆ రోజులు గుర్తుకువచ్చాయి. మీరు చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెబుతున్నారు. మూవీలో ఎలాంటి మలుపులు ఉంటాయో మాకూ తెలియదు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రమిది. ఇలాంటి సినిమాలు తరుచూ రావు. ఈ టీమ్ అంతా చాలా కష్టపడి, ప్యాషనేట్ గా మూవీ చేశారు. రేపు థియేటర్స్ లోకి వస్తున్న సుయోధన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
షార్ట్ ఫిల్మ్‌తో ఎంట్రీ.. ఇప్పుడేమో వరుస ఆఫర్లు.. ఎవరీమె?
సినీరంగంలోకి దూసుకెళ్తన్నారు ప్రముఖ నటి ద్రిషికా చందర్. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాదు.. సమర్థవంతమైన వక్తగా కూడా రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా.. తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం మరో విశేషం.ద్రిషికా చందర్ తెలుగు భాషలో 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా 'ఉత్తమ నటి అవార్డులు' పొందారు. అంతేకాదు మనసానమః చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. తెలుగులో 'బుచ్చి నాయుడు కండ్రిగ', 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' తదితర చిత్రాలతో సినీ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటించిన 'సుయోధన' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి వైఎస్ మాధవ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడిమోలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇప్పటికే తెలుగులో నాలుగు, హిందీలో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అంతేకాకుండా మలయాళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇటీవలే జియో సినిమాలో రిలీజైన హిందీ మూవీ 'హే కమీనీ'లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ద్రిషికా నటిస్తోన్న మరిన్ని మలయాళ, తెలుగు భాషా చిత్రాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి.ఆమె వెండి తెరపైనే కాకుండా నాటక రంగంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. 'ఏవం ఇంద్రజిత్' అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టున్న ద్రిషికా చందర్.. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయారు. View this post on Instagram A post shared by DRISHIKA CHANDER (@drishikachander) -
అసలు ఈ సుయోధన ఎవడు?.. ఆసక్తిగా టీజర్
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం సుయోధన. ఈ సినిమాకు వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అసలు ఈ స్టోరీ నీకు ఎక్కడ దొరికింది? అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. టీజర్ చూస్తుంటే దుర్యోధనుడిలా కనిపించే ఓ వ్యక్తి వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
ప్రియదర్శి ‘సుయోధన’.. రిలీజ్ ఎప్పుడంటే..
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ మంచి కదా కదానాలతో అత్యత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ప్రియదర్శి సాయికుమార్ ద్రిషిక చందర్ , సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. జై క్రిష్ సంగీత దర్శకత్వం వహించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ను అందించారు . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 27 న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాము. త్వరలో ఈ సినిమా టీజర్ ట్రైలర్ మరియు పాటలను రిలీజ్ చేస్తాము అన్నారు.


