ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడుమోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ - సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది. అన్నారు.
డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ - సుయోధన మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్ చేస్తున్నారు. ప్రియదర్శి, సాయికుమార్ నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీరు రీచ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.


