Drishika Chander
-
కొత్త నిర్మాతలకు ఇదే నా సలహా : ‘సుయోధన’ నిర్మాత
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడుమోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ - సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది. అన్నారు.డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ - సుయోధన మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్ చేస్తున్నారు. ప్రియదర్శి, సాయికుమార్ నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీరు రీచ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు. -
సినిమా ఫ్లాప్ అయితే.. కోడి రామకృష్ణ మాటలు గుర్తు తెచ్చుకుంటా: ప్రియదర్శి
ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ ‘సుయోధన’ సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నుహైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ - ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు మరింత చేరువ కావాలి, వారి ఆదరణ మరింత పొందాలనే ప్రయత్నిస్తుంటాను. ఆ క్రమంలో ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే బాధగా ఉంటుంది. అలాంటప్పుడే కోడి రామకృష్ణ లాంటి లెజెండ్స్ నా గురించి బాగా చెప్పారు కదా అనే ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుంటాయి. సాయి కుమార్ , ఆయన కుటుంబం 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. పరిశ్రమ అభివృద్ధిలో భాగమవుతున్నారు. ఈ చిత్రంలో సుయోధన పాత్రకు ఆయన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అంత బాగా నటించారు. ప్రేక్షకుల ఊహకు అందనంత ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఈ కథ, టైటిల్ విన్నప్పుడే ఇది కొత్తగా ఉంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమానే నన్ను సెలెక్ట్ చేసుకుందని అనిపిస్తుంటుంది. ఈ చిత్రంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. హాలీవుడ్ క్లాసిక్ మూవీ డ్యూన్ లెవెల్లో ఈ సినిమా చేయాలని మా మూవీ టీమ్ పట్టుదలగా పనిచేశారు. మా సినిమాను మీరు థియేటర్స్ లో చూసి మంచి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా’అన్నారు.సాయికుమార్ మాట్లాడుతూ - నేను 1972లో ధుర్యోధనుడి పాత్రను నాటికలో అభినయించాను. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. ఇప్పుడు ఈ చిత్రంలో సుయోధనుడిగా నటిస్తుంటే ఆ రోజులు గుర్తుకువచ్చాయి. మీరు చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెబుతున్నారు. మూవీలో ఎలాంటి మలుపులు ఉంటాయో మాకూ తెలియదు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రమిది. ఇలాంటి సినిమాలు తరుచూ రావు. ఈ టీమ్ అంతా చాలా కష్టపడి, ప్యాషనేట్ గా మూవీ చేశారు. రేపు థియేటర్స్ లోకి వస్తున్న సుయోధన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
షార్ట్ ఫిల్మ్‌తో ఎంట్రీ.. ఇప్పుడేమో వరుస ఆఫర్లు.. ఎవరీమె?
సినీరంగంలోకి దూసుకెళ్తన్నారు ప్రముఖ నటి ద్రిషికా చందర్. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాదు.. సమర్థవంతమైన వక్తగా కూడా రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా.. తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం మరో విశేషం.ద్రిషికా చందర్ తెలుగు భాషలో 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా 'ఉత్తమ నటి అవార్డులు' పొందారు. అంతేకాదు మనసానమః చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. తెలుగులో 'బుచ్చి నాయుడు కండ్రిగ', 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' తదితర చిత్రాలతో సినీ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటించిన 'సుయోధన' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి వైఎస్ మాధవ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడిమోలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇప్పటికే తెలుగులో నాలుగు, హిందీలో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అంతేకాకుండా మలయాళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇటీవలే జియో సినిమాలో రిలీజైన హిందీ మూవీ 'హే కమీనీ'లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ద్రిషికా నటిస్తోన్న మరిన్ని మలయాళ, తెలుగు భాషా చిత్రాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి.ఆమె వెండి తెరపైనే కాకుండా నాటక రంగంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. 'ఏవం ఇంద్రజిత్' అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టున్న ద్రిషికా చందర్.. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయారు. View this post on Instagram A post shared by DRISHIKA CHANDER (@drishikachander)


