ప్రియదర్శి ‘సుయోధన’.. రిలీజ్‌ ఎప్పుడంటే.. | Priyadarshi Suyodhana Movie Release Date Fixed | Sakshi
Sakshi News home page

ప్రియదర్శి ‘సుయోధన’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Mar 10 2026 4:26 PM | Updated on Mar 10 2026 4:40 PM

Priyadarshi Suyodhana Movie Release Date Fixed

ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ మంచి కదా కదానాలతో అత్యత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ప్రియదర్శి సాయికుమార్  ద్రిషిక చందర్ , సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. జై క్రిష్ సంగీత దర్శకత్వం వహించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ను అందించారు . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 27 న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాము. త్వరలో ఈ సినిమా టీజర్ ట్రైలర్ మరియు పాటలను రిలీజ్ చేస్తాము అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement